యాప్నగరం

జీఎస్టీ: ట‌్యాక్స్ పేయ‌ర్ల‌కు శుభ‌వార్త‌

జీఎస్‌టీ కింద నమోదైన సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబరు, ఇ-మెయిల్‌ వివరాల్లో ఏమైనా సవరణలు ఉంటే, మార్చుకునే అవకాశాన్ని ఆర్థిక శాఖ కల్పించింది.

Samayam Telugu 15 Jun 2018, 3:19 pm
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కింద నమోదైన సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబరు, ఇ-మెయిల్‌ వివరాల్లో ఏమైనా సవరణలు ఉంటే, మార్చుకునే అవకాశాన్ని ఆర్థిక శాఖ కల్పించింది. ఇందుకోసం జీఎస్టీని చెల్లించేవారు తమ పరిధిలోని జీఎస్‌టీ అధికారి వద్దకు సంబంధిత పత్రాలతో వెళ్లాలి. చెల్లింపుదారు జీఎస్‌టీ నెంబరుకు కేటాయించిన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఆ అధికారి ఇస్తారు. ఆ తర్వాత జీఎస్‌టీ పోర్టల్‌లోని ‘సెర్చ్‌ ట్యాక్స్‌పేయర్‌’ సాయంతో మనం ఎంపిక చేసుకున్న పరిధి సరైనదేనా, కాదా గుర్తించాలి. అనంతరం జీఎస్‌టీఐఎన్‌కు సంబంధించి వ్యాపార వివరాల రుజువు నిమిత్తం అవసరమైన పత్రాలను జీఎస్‌టీ అధికారికి సమర్పించాలి. వాటిని పరిశీలించాక కొత్త మొబైల్‌ నెంబరు, ఇ-మెయిల్‌ చిరునామాను అందులో పొందుపరుస్తారు.
Samayam Telugu gst on products
వస్తు సేవల పన్ను (

జీఎస్టీ


పత్రాల అప్‌లోడింగ్‌ పూర్తయ్యాక, జీస్‌టీఐఎన్‌కు కేటాయించిన పాస్‌వర్డ్‌ను అధికారి రీసెట్‌ చేస్తారు. ఆ తర్వాత మార్పు చేసిన ఇ-మెయిల్‌ చిరునామాకు యూజర్‌నేమ్‌, తాత్కాలిక పాస్‌వర్డ్‌ వస్తాయి. వాటిని ఉపయోగించి, జీఎస్‌టీ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యాక పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌ను మనకు నచ్చినట్లుగా మార్చుకోవాలి. సవరించిన ధర స్టిక్కర్‌తో జులై 31 వరకూ విక్రయించొచ్చు
జీఎస్‌టీ అమలుకు ముందు తయారైన ఉత్పత్తుల ప్యాకింగ్‌పై, సవరించిన ధర ముద్ర (స్టిక్కర్‌)తో జులై 31 వరకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతేడాది జులై 1 నుంచి జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఎంఆర్‌పీతో ప్యాకింగ్‌ అయిన ఉత్పత్తులపై సవరించిన ధర ముద్రించి విక్రయించేందుకు గత సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.