యాప్నగరం

కాల్ డ్రాప్స్ అరికట్టడానికి కొత్త ప్లాన్

కాల్ డ్రాప్స్ సమస్యను పరిస్కరించడానికి టెలీకాం కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.

TNN 29 Dec 2016, 12:05 pm
కాల్ డ్రాప్స్ సమస్యను పరిస్కరించడానికి టెలీకాం కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాయి. కాల్ డ్రాప్స్‌ను తగ్గించడానికి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ మధ్య 1.30 లక్షల బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్ (సెల్ టవర్లు)ను కంపెనీలు ఏర్పాటు చేసాయి. అయితే 2017 మార్చి నాటికి వీటి సంఖ్యను 1.50 లక్షలకు పెంచేలా టెలీకాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
Samayam Telugu telecom companies have a new plan to tackle call drops
కాల్ డ్రాప్స్ అరికట్టడానికి కొత్త ప్లాన్


వినియోగదారుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోడానికి, కాల్ డ్రాప్స్ సమస్యను అరికట్టడానికి ఈ ఫీడ్‌బ్యాక్‌ను ఉపయోగించుకోవడానికి ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS)ను టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఐబీఆర్ఎస్ సదుపాయాన్ని ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవాల్లో 2016 డిసెంబర్ 23న ప్రారంభించినట్లు ప్రకటనలో వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు అతి త్వరలో ఈ ఐవీఆర్‌ఎస్ సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఐవీఆర్ ప్రారంభమైతే ఫోన్లు వినియోగిస్తున్నవారికి 1955 నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈ కాల్‌ను స్వీకరించిన వినియోగదారుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీ ఏరియాలో మీరు కాల్ డ్రాప్స్ సమస్యను ఏమైనా ఎదుర్కొంటున్నారా? వంటి రికార్డెడ్ ప్రశ్నలు వినియోగదారుడిని అడుగుతారు. దీనికి ఫోన్ యూజర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ ఏరియాలో విపరీతంగా కాల్ డ్రాప్స్ సమస్య ఉంటే 1955 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఎస్ఎంఎస్ కూడా పంపొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.