యాప్నగరం

10 రోజుల్లో బడ్జెట్.. ఈ 10 విషయాలు తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 1 (శనివారం) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ సర్కార్ కొత్త బడ్జెట్‌ ఆవిష్కరించనుంది. ఈసారి బడ్జెట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మధ్యతరగతి, ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయో చూడాలి.

Samayam Telugu 22 Jan 2020, 5:44 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 1 (శనివారం) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ సర్కార్ కొత్త బడ్జెట్‌ ఆవిష్కరించనుంది. ఈసారి బడ్జెట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మధ్యతరగతి, ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయో చూడాలి.
Samayam Telugu ten fascinating facts to know about union budget
10 రోజుల్లో బడ్జెట్.. ఈ 10 విషయాలు తెలుసా?


31 నుంచే..

పార్లమెంట్‌లో జనవరి 31న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సెషన్ ప్రారంభమౌతుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను (లోక్ సభ, రాజ్య సభ) ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ప్రధాన ఆర్థిక సలహాదారుడు కేవీ సుబ్రమణియన్ ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు ఏంటివో చూద్దాం..

Also Read: షాకిచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇవే!

1. బడ్జెట్ అనే పదం బౌగెట్టే అనే పదం ఆధారంగా వచ్చింది. ఈ పదానికి ఫ్రెంచి భాషలో తోలు సంచి (లెదర్ బ్యాగ్) అని అర్థం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం.. ఒక ఏడాది కేంద్ర ప్రభుత్వపు ఆదాయవ్యయాల అంచనాలే బడ్జెట్.

Also Read: ఎస్‌బీఐ Vs పోస్టాఫీస్.. నెలకు రూ.10తో రూ.725.. రెండింటిలో ఏది బెస్ట్?

2. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ సంప్రదాయం 1850 నుంచి కొనసాగుతూ వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి విలియమ్ ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ బ్రీఫ్‌కేసులోనే బడ్జెట్ పత్రాలు తెచ్చారు.

Also Read: HDFC Bank Vs ఎస్‌బీఐ Vs ఐసీఐసీఐ బ్యాంక్.. ఏ బ్యాంక్‌‌లో మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోండి!

3. 1860 ఏప్రిల్ 7న భారత్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్.. బ్రిటిష్ రాణికి ఈ బడ్జెన్‌ను సమర్పించారు.

Also Read: మోదీ సర్కార్‌కు SBI బడ్జెట్ ప్రతిపాదనలు.. ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్?

4. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్‌.కె. షణ్ముగం చెట్టి 1947లో దేశీ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Also Read: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌ అదిరింది.. ఉచిత కాల్స్, డేటాతోపాటు రూ.2 లక్షల ప్రయోజనం!

5. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరా గాంధీ చరిత్రలో నిలిచారు. ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు మాత్రమే ఇది సాధ్యమైంది.

Also Read: 2020లో మీ డబ్బు ఇక్కడ పెడితే అదిరిపోయే రాబడి..!

6. బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక జరుగుతుంది. దీని తర్వాత ఆర్ధిక శాఖకు చెందిన పలువురు అధికారులు బయటి ప్రపంచానికి దూరం అవుతారు. హల్వా వేడుక పూర్తి కాగానే బడ్జెట్ ప్రతులు ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఇక అప్పటి నుంచి ఆర్ధిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు... బడ్జెట్ వ్యవహారాల్లో పాల్గొనే అధికారులందరికీ తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోతాయి. నార్త్ బ్లాక్ కార్యాలయంలోనే ఉండాలి.

Also Read: Axis Bank పర్సనల్ లోన్.. రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణం.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి!

7. మాజీ ప్రధాని, ఆర్థిక మంతి అయిన మొరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పది సార్లు బడ్జెట్‌ను ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రులు అయిన కేసీ నియోగీ, హెచ్‌ఎన్ బహుగుణ మాత్రం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు.

Also Read: నెలకు కేవలం రూ.5,000తో చేతికి ఏకంగా రూ.కోటి.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్!

8. 2000 వరకు ఫిబ్రవరి నెలలో చివరి పనిదినం రోజు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. 2001 నుంచి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి 1 తేదీనే బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తోంది.

Also Read: డెబిట్/ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఇలా చేయకపోతే మీ కార్డుల పనిచేయవు!

9. 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేశారు. దీంతో 92 ఏళ్ల సంప్రదాయానికి బ్రేకులు పడ్డాయి. ఆరుణ్ జైట్లీ ఈ విధంగా బడ్జెట్‌ను ఆవిష్కరించారు.

Also Read: ICICI Bank శుభవార్త.. కార్డు లేకుండానే ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

10. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక వారం ముందు బడ్జెట్ పత్రాలను ముద్రించడం ప్రారంభిస్తారు. నార్త్ బ్లాక్‌లోని స్పెషల్ గవర్నమెంట్ ప్రెస్‌లో వీటిని ప్రింట్ చేస్తారు.

Also Read: ఇంటి కొనుగోలుదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త! ఆ 3 బెనిఫిట్స్ అందేనా?

సింగ్ ఈజ్ కింగ్

1992-93లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అత్యంత ముఖ్యమైన బడ్జెట్‌గా అభివర్ణిస్తారు. ఈయన దిగుమతి సుంకాన్ని 300 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.