యాప్నగరం

NPS Rules Changed: ఎన్‌పీఎస్ స్కీమ్‌లో భారీ మార్పులు, సబ్‌స్క్రయిబర్లు తప్పక తెలుసుకోవాలి!

NPS Rules Changed: నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో సబ్‌స్క్రయిబ్ అవుదామని అనుకుంటున్నారా..? అయితే ముందస్తుగా మీరు మారిన రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎన్‌పీఎస్ రూల్స్‌లో ఇటీవల ఐదు అతిపెద్ద మార్పులు వచ్చాయి. పెన్షన్ పండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఈ రూల్స్‌ను ప్రకటించాయి. మారిన ఈ ఐదు నిబంధనలేమిటి..? సబ్‌స్క్రయిబర్లపై ప్రభావమెంత..? అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Authored byKoteru Sravani | Samayam Telugu 25 Sep 2022, 11:22 am

ప్రధానాంశాలు:

  • ఎన్‌పీఎస్ రూల్స్‌లో మార్పులు
  • ప్రతి ఒక్క సబ్‌స్క్రయిబర్ తప్పక తెలుసుకోవాలి
  • రిటైర్‌మెంట్‌కు ఉత్తమమైన పొదుపు పథకంగా ఎన్‌పీఎస్
  • మెచ్యూరిటీ సమయంలో లంప్‌సమ్‌తో పాటు నెలనెలా పెన్షన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu NPS Rules Change
ఎన్‌పీఎస్ నిబంధనల్లో మార్పు
NPS Rules Changed: నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) నిబంధనల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) పలు రకాల మార్పులు చేసింది. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఎవరైనా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేక ఆ స్కీమ్ పింఛనుదారులైన మారిన ఈ నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ అనేది వాలంటరీ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే.. మెచ్యూరిటీ సమయంలో 60 శాతం మొత్తాన్ని మనం లంప్‌సమ్‌లో డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ కొనుగోలు చేసి, ప్రతి నెలా పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఈ స్కీమ్ పింఛనుదారులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అయితే ప్రస్తుతం మనం NPSలో ఇటీవల మారిన 5 నిబంధనల గురించి తెలుసుకుందాం..
ఎన్‌పీఎస్ అకౌంట్ తెరిస్తే కమిషన్..
ఎన్‌పీఎస్ అకౌంట్‌ను తెరిచే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్‌(POPs)లకు కమిషన్ లభించనుంది. పీఓపీలుగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర సంస్థలు వ్యవహరించవచ్చు. పీఓపీలకు రూ.15 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కమిషన్ ఇవ్వాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. ఈ నెల ప్రారంభం నుంచి ఈ కమిషన్ వర్తిస్తుంది.

ఈ-నామినేషన్‌లో మార్పులు..
కొత్త నిబంధనల ప్రకారం.. నోడల్ అధికారి వన్ టైమ్ ఈ-నామినేసన్(NPS e-nomination) అభ్యర్థనను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ 30 రోజుల్లో ఈ-నామినేషన్‌పై నోడల్ అధికారి నిర్ణయం తీసుకోకపోతే.. సెంట్రల్ రికార్డు కీపింగ్ సిస్టమ్ ద్వారా ఈ-నామినేషన్ అభ్యర్థనను అంగీకరిస్తుంది. ఈ రూల్ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.

యాన్యుటీ ప్లాన్‌కి మరో ఫామ్ అవసరం లేదు..
మెచ్యూరిటీ సమయంలో.. యాన్యుటీ కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఫామ్‌ను సమర్పించాల్సినవసరం లేదు. IRDAI ఎన్‌పీఎస్ సబ్‌స్క్రయిబర్ల కోసం ఈ నిబంధనను సడలించింది. ఎన్‌పీఎస్ స్కీమ్‌ నుంచి వైదొలిగే సమయంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు యాన్యుటీ కొనుగోలును ఆఫర్ చేయాల్సి ఉంటుంది.

Also Read : Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిపోయిన బంగారం ధర, కుప్పకూలిన వెండి రేట్లు

జీవన ప్రమాణ పత్రం సమర్పణ సులభతరం..
జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే ప్రక్రియను సులభతరం చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ లేదా ప్రామాణీకరణ ద్వారా జీవన ప్రమాణ పత్రాన్ని(digital life certificate) ఇన్సూరెన్స్ కంపెనీలు చేపట్టవచ్చు.

క్రెడిట్ కార్డు పేమెంట్లు బ్యాన్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ టైర్ 2 అకౌంట్లను సబ్‌స్క్రిప్షన్ చేసుకునేందుకు, ఈ అకౌంట్లలో డబ్బులు చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్ల(credit card payments)ను పీఎఫ్‌ఆర్‌డీఏ రద్దు చేసింది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్లకు క్రెడిట్ కార్డు పేమెంట్లను స్వీకరించడాన్ని ఆపివేయాలని పాయింట్స్ ఆఫ్ ప్రజెన్స్(పీఓపీలను)ను కూడా ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ ఆదేశించింది. ఈ రూల్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. పీఎఫ్‌ఆర్‌డీఏ ఈ నిర్ణయంతో.. టైర్ 2 అకౌంట్లకు క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లను అంగీకరించడం లేదు.

Also Read : మూన్‌లైటింగ్ చేస్తున్న ఉద్యోగులపై టెక్ దిగ్గజాలు వేటు, కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.