యాప్నగరం

Fixed Deposit Rates: ఎక్కువ వడ్డీ కావాలా? ఈ బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోండి!

Fincare Small Finance Bank FD Interest Rates: మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటని ఆలోచిస్తున్నారా? ఏ బ్యాంక్‌లో వడ్డీ ఎక్కువగా వస్తోందో తెలుసుకోవాలి. ఆ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిల్లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంక్ తాజాగా ఎఫ్‌డీ రేట్లు పెంచేసింది.

Authored byKhalimastan | Samayam Telugu 28 May 2022, 10:48 am

ప్రధానాంశాలు:

  • డబ్బులు దాచుకోవాలనుకునే వారికి శుభవార్త
  • వడ్డీ రేట్లు పెంచేసిన మరో బ్యాంక్
  • ఈ బ్యాంక్‌లో 7 శాతం వరకు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు
  • రేట్ల పెంపు ఇప్పటికే అమలులోకి వచ్చేసింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Fixed Deposit interest Rates
వడ్డీ రేట్లు పెంపు
FD Interest Rates: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD Rates) వడ్డీ రేట్లు పెరిగాయి. రూ. 2 కోట్లకు లోపు ఎఫ్‌డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 2022 మే 24 నుంచే వడ్డీ రేట్ల పెంపు అమలులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పలు రకాల కాల పరిమితుల్లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ రాబడి వస్తుంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగింది. 3.25 శాతం నుంచి 3.5 శాతానికి చేరింది. ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బీ అలాగే 91 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. ఇప్పుడు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. గతంలో 3.5 శాతం వడ్డీ వచ్చేది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. 181 రోజుల నుంచి 364 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ఎఫ్‌డీలపై 5.15 శాతం వడ్డీ వచ్చేది.

12 నెలల నుంచి 18 నెలల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగింది. 6 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ 18 నెలల ఒక రోజు నుంచి 36 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 36 నెలల ఒక రోజు నుంచి 42 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. గతంలో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం వచ్చేది. ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బీ 42 నెలల ఒక రోజు నుంచి 59 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ వస్తోంది. 59 నెలల ఒక రోజు నుంచి 66 నెలల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 66 నెలల 1 రోజు నుంచి 84 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 6 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్స్ 0.5 శాతం అదనపు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.