యాప్నగరం

LPG Cylinder: రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. వారికి మాత్రమే..

Ration Card : గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందొచ్చు. అయితే ఇది అందరికీ కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన వారికి ఫ్రీ ఎల్‌పీజ సిలిండర్ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఏడాదిలో మూడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందొచ్చు. అయితే ఇలా పొందాలని భావించే వారు కచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో కూడా అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది.

Authored byKhalimastan | Samayam Telugu 12 Jul 2022, 4:09 pm

ప్రధానాంశాలు:

  • ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
  • అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం
  • ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా లభిస్తాయి
  • రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lpg cylinder
రేషన్ కార్డు ఉంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్
Gas Cylinder: ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ధరలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సామాన్యులకు ఊరట. ఉచితంగానే గ్యాస్ సిలిండర్ పొందొచ్చు. ఏడాదికి మూడు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఎలా? ఎవరికి? ఎప్పుడు అని ఆలోచిస్తున్నారా? ఉత్తరఖండ్ ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన వారికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల అక్కడ నివసించే ప్రజలకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనం రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే లభిస్తుంది. అందులో కూడా అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారికే ఈ బెనిఫిట్ ఉంటుంది.
అంతేకాకుండా అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారు కచ్చితంగా వారి కార్డును గ్యాస్ కనెక్షన్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వీరికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రయోజనం లభిస్తుంది. ఉచిత సిలిండర్ వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని, కానీ ఈ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే అర్హత కలిగిన వారికి మాత్రమే లబ్ది కలుగుతుందని తెలిపింది.

Also Read: undefined

ఉచిత సిలిండర్ పొందేందుకు అర్హతలు ఇవే
* ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తుంది.
* ఉత్తరఖండ్‌లో నివాసం ఉంటున్న, అక్కడి పౌరులకు మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది.
* అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారికే ఈ ప్రయోజనం వర్తింపు
* అలాగే రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం అయ్యి ఉండాలి.

వెంటనే ఇలా చేయండి
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అర్హత కలిగిన వారికి ఈ విషయాన్ని వెల్లడించింది. అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారు దాన్ని గ్యాస్ కనెక్షన్‌తో లింక్ చేసుకోవాలని సూచించింది. జూలై నెలలోనే ఈ పని పూర్తి చేసుకోవాలని కోరింది. ఇప్పటికే జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారి లిస్ట్ గ్యాస్ ఏజెన్సీలకు చేరింది. దాదాపు 2 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు లభించనున్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 55 కోట్ల వరకు భారం పడనుంది. కాగా ప్రస్తుతం గ్యాస్ సిలిండగర్ ధర రూ. 1100కు పైనే ఉంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.