యాప్నగరం

ఆర్బీఐ నుంచి కొత్త రూ.500 నోటు!!

నల్లధనంపై పోరులో భాగంగా గతేడాది నవంబరు 8 న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాటి స్థానంలో రూ.2,000, 500 నోట్లను అందుబాటులోకి తెచ్చింది.

TNN 13 Jun 2017, 1:03 pm
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు కొన్ని ఫీచర్లు జోడించి కొత్త వాటిని విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. చెలామణిలో ఉన్న రూ.500 నోట్లకు మరింత భద్రత కల్పించి కొత్తవాటిని విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొత్త నోటుపై 'ఏ' అనే అక్షరాన్ని జోడించామని పేర్కొంది. గత నవంబరులో రూ.1,000, రూ.500 నోట్లను కేంద్రం రద్దు చేసిన తర్వాత విడుదలైన రూ. 500 నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. నకిలీ నోట్లను అరికట్టేందుకే అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ను జోడించామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. కాగా, ఒక రూపాయి నోటును సైతం తిరిగి ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu today rbi announces new rs 500 note issue
ఆర్బీఐ నుంచి కొత్త రూ.500 నోటు!!


దేశంలోని అవినీతిపై పోరాడి, నల్లధనాన్ని వెలికితీయడానికి చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు గత నవంబరు 8 న ప్రధాని ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి సామాన్య ప్రజల నుంచి ఆదరణ లభించింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టినా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయగలమని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయడానికి అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.