యాప్నగరం

డీటీహెచ్ యూజర్లకు శుభవార్త.. రూ.130కే 200 ఛానళ్లు.. ట్రాయ్ కొత్త రూల్స్!

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు అందించింది. గతంలో కొత్త ధరల విధానాన్ని ఆవిష్కరించిన ట్రాయ్ పలు విమర్శలు ఎదుర్కొంది. కొత్త విధానంతో ధరలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని టీవీ యూజర్లు ఆరోపించారు. అయితే ఇప్పుడు ట్రాయ్ మళ్లీ ధరల విధానంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.

Samayam Telugu 2 Jan 2020, 3:18 pm
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు అందించింది. గతంలో కొత్త ధరల విధానాన్ని ఆవిష్కరించిన ట్రాయ్ పలు విమర్శలు ఎదుర్కొంది. కొత్త విధానంతో ధరలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని టీవీ యూజర్లు ఆరోపించారు. అయితే ఇప్పుడు ట్రాయ్ మళ్లీ ధరల విధానంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.
Samayam Telugu trai good news 200 channels now slashed to rs 130 here are all the changes
డీటీహెచ్ యూజర్లకు శుభవార్త.. రూ.130కే 200 ఛానళ్లు.. ట్రాయ్ కొత్త రూల్స్!


3 కొత్త నిర్ణయాలు

ట్రాయ్ డీటీహెచ్ అండ్ కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ మార్పు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లపై భారం తగ్గనుంది. కొత్త నిర్ణయంతో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్‌) దిగిరానుంది. అంతేకాకుండా ఆపరేటర్లు దీర్ఘకాల ప్లాన్లు ఎంచుకునే కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రాయ్ తాజాగా మల్టీ టీవీ కనెక్షన్ రూల్స్‌ను మార్చింది.

Also Read: షాకిచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..

ఎన్‌సీఎఫ్ తగ్గుదలతో ఎంతో లాభం

ఎన్‌సీఎఫ్ తగ్గుదల వల్ల రూ.130కే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి. వీటికి అదనంగా చూడాలనుకునే ఛానళ్లకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు రూ.130 చెల్లిస్తే 200 ఛానళ్లు వస్తాయి. దీనికి జీఎస్‌టీ అదనం. ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కంపల్సరీ ఛానల్స్ ఈ 200 ఛానళ్లలోకి రావని తెలుస్తోంది.

Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. నేటి నుంచి 3 కొత్త నిర్ణయాలు అమలులోకి.. ఖాతాదారులపై ఎఫెక్ట్!

రెండో కనెక్షన్‌పై తగ్గింపు

యూజర్లు రెండో కనెక్షన్ తీసుకుంటే అప్పుడు దీనికి ఎన్‌సీఎఫ్‌లో గరిష్టంగా 40 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆరు లేదా అంతకన్నా ఎక్కువ వాలిడిటీ ఉన్న ప్లాన్లు ఎంచుకుంటే ఆపరేట్లు యూజర్లకు ఆఫర్లు అందిచాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తాయి.

Also Read: కళ్లుచెదిరే లాభం.. రూ.లక్ష పెడితే 5 ఏళ్లలోనే రూ.18 లక్షలు!

ఇకపై ఎక్కువ ఛానళ్లు

గతంలో ఎన్‌సీఎఫ్ చార్జీలు రూ.130గా ఉండేవి. ఇది 100 ఛానళ్లకు వర్తించేది. ఇందులో 75 పే ఎస్‌డీ ఛానళ్లు, 25 దూరదర్శన్ ఛానళ్లు కలిసి ఉండేవి. అయితే ఇప్పుడు ఛానళ్ల సంఖ్యను 200కు పెంచారు. అంటే ఇప్పుడు రూ.130 ధరలోనే ఇంకో 100 అదనపు పే ఛానళ్లు పొందొచ్చు. ఈ 200 ఛానళ్ల పరిమితి దాటితే అప్పుడు ప్రతి 25 పే చానళ్లకు రూ.20 ఎన్‌సీఎఫ్ చార్జీలు రూ.20 గా ఉంటాయి.

Also Read: కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి!

రూ.160 మించకూడదు

ఇకపోతే ట్రాయ్ డీటీహెచ్, కేబుల్ టీవీ ఆపరేట్లకు నతన ప్లాట్‌ఫామ్ ద్వారా అందించే ఛానళ్లకు రూ.160 మించి ఎక్కువ వసూలు చేయవద్దని పేర్కొంది. అంటే ఫ్రీ టు ఎయిర్ ఛానళ్లకు ఇది వర్తిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.