యాప్నగరం

ట్విట్టర్ ఇండియా ఎండీ రాజీనామా

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ట్విట్టర్’లో ఉన్నతోద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి.

TNN 3 Nov 2016, 4:37 pm
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ట్విట్టర్’లో ఉన్నతోద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. రెండురోజుల క్రితం ట్విట్టర్ ఇండియా హెడ్ రిషి జైట్లీ తన పదవికి రాజీనామా చేయగా, తాజాగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పర్మీందర్ సింగ్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆగ్నేయాసియా, ఇండియా, మధ్య తూర్పు ఉత్తర ఆఫ్రికా (ఎంఈఎన్ఏ) ప్రాంతానికి పర్మీందర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu twitter india md parminder singh quits
ట్విట్టర్ ఇండియా ఎండీ రాజీనామా


ప్రస్తుతం పర్మీందర్ స్థానంలో మాయ హరి కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఈయన ఆగ్నేయాసియా, ఇండియా రీజియన్ వ్యవహారాలు మాత్రమే చూసుకోనున్నట్లు ట్విట్టర్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ అలిజా నాక్స్ స్పష్టం చేశారు. అయితే మధ్య తూర్పు ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి బెంజమిన్ ఆంపెన్ ఎండీగా వ్యవహరిస్తారు.

కంపెనీలో ఉన్నతోద్యోగులు వరసగా రాజీనామాలు చేయడంతో ట్విట్టర్ కొంత ఇబ్బందుల్లో పడింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ వృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీ ప్రక్షాలనలో భాగంగా గత సంవత్సరం ట్విట్టర్ సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.