యాప్నగరం

PMAY Urban: ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త.. మరో రెండేళ్ల పాటు ఈ స్కీమ్!

PMAY Urban: పట్టణాల్లో ఉన్న మధ్య తరగతి ప్రజలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి పక్కా ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 2015 జూన్ నెలలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(అర్బన్) స్కీమ్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ను మరో రెండేళ్ల పాటు పొడిగించింది. డిసెంబర్ 2024 వరకు పీఎంఏవై-అర్బన్ స్కీమ్ అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీమ్ కింద జారీ అయ్యే ఇళ్లకు తాము ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 11 Aug 2022, 2:09 pm
PMAY Urban: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(అర్బన్) స్కీమ్‌ను డిసెంబర్ 2024 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. జూన్ 2015లో లాంచ్ చేసిన ఈ స్కీమ్‌ కింద అందరికీ పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022 మార్చి నాటికి అర్హులైన అర్బన్ లబ్దిదారులందరికీ పక్కా ఇళ్లను అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మార్చి 31, 2022 నాటికి జారీ చేసిన 122.69 లక్షల ఇళ్లకు ఆర్థిక సాయం అందించనున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ స్కీమ్‌ను పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిసెంబర్ 31, 2024 వరకు PMAY-Urban స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.
Samayam Telugu PMAY Urban
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్


2015 నుంచి కేంద్రం ఆమోదించిన ఆర్థిక సాయం రూ.2.03 లక్షల కోట్లుగా ఉంది. మార్చి 31, 2022 నాటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం, రాయితీ కింద రూ.1,18,020.46 కోట్లను విడుదల చేసింది. డిసెంబర్ 31, 2024 నాటికి రూ.85,406 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. డిసెంబర్ 31, 2024 నాటికి ఈ స్కీమ్‌ను పొడిగించడంతో.. బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్, అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్, ఇన్-సిటు స్లమ్ రీడెవలప్‌మెంట్ కింద ఇప్పటికే జారీ అయిన ఇళ్లను పూర్తి చేయడానికి సాయం లభించనుంది. ఈ స్కీమ్‌కి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుండగా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. దీనిలో లబ్దిదారుల ఎంపిక కూడా ఉండనుంది.

పీఎంఏవై సైటులోని వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 122.69 లక్షల ఇళ్లను జారీ చేయగా.. వాటిలో 61.77 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. కరోనా ప్రభావంతో ఈ స్కీమ్ కింద ప్రాజెక్టులను పూర్తి చేయడం ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం ఈ స్కీమ్ గడువును పొడిగించింది. పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లను అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం భూమి, నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది. డిసెంబర్ 2021లోనే కేంద్ర కేబినెట్ రూరల్ హౌసింగ్ స్కీమ్ PMAY-Gramin (Rural)ను మార్చి 2024 వరకు పొడిగించింది. ప్రస్తుతం అర్బన్ హౌసింగ్ స్కీమ్ గడువును కూడా పెంచింది.

Also Read :
ఈ పెన్నీ స్టాక్స్‌లో డబ్బులు పెట్టండి.. మీకు కళ్లు చెదిరే లాభాలు!

Also Read : Paytm New Service: పేటీఎం యూజర్లకు సరికొత్త సర్వీసు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.