యాప్నగరం

ఆడ పిల్లల కోసం మరో కొత్త స్కీమ్.. ప్రతి ఒక్కరికీ రూ.15,000!

Sukanya Samriddhi Yojana | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిల ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆడ పిల్లల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకువస్తుంటాయ. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను లాంచ్ చేయబోతోంది.

Samayam Telugu 17 Oct 2019, 1:31 pm

ప్రధానాంశాలు:

  • ఆడ పిల్లల కోసం కొత్త పథకం
  • అక్టోబర్ 25న లాంచ్ చేయనున్న ముఖ్యమంత్రి
  • ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు స్కీమ్ వర్తింపు
  • ఆరు విడతల్లో డబ్బులు అందజేత

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kanya Sumangala Scheme
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడ పిల్లల కోసం వివిధ రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆడ పిల్లల కోసం కొత్త స్కీమ్‌ను లాంచ్ చేయబోతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 25న కన్యా సుమంగళ యోజన స్కీమ్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ పథకం కింద ఆరు విడతల్లో ఆడ పిల్లలకు మొత్తంగా రూ.15,000 అందిస్తారు. ఇది మంచి స్కీమ్‌ అనే చెప్పుకోవచ్చు. అమ్మాయి ఇంటర్ పూర్తయ్యే సరికి మొత్తం డబ్బులు వచ్చేస్తాయి.

Also Read: undefined

కన్యా సుమంగల యోజన పథకంలో సులభంగానే చేరొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం mksy.up.gov.in అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం కోసం యోగి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,200 కోట్లు కేటాయించింది.

Also Read: undefined

రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం కింద ప్రయోజనం పొందొచ్చు. ఏప్రిల్ తర్వాత పుట్టిన ఆడ పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Also Read: undefined

పాపు పుట్టినప్పుడు రూ.2,000 ఇస్తారు. వాక్సినేషన్ తర్వాత రూ.1000, ఫస్ట్ క్లాస్‌తో చేరినప్పుడు రూ.2000, 6వ క్లాస్‌లో చేరినప్పుడు రూ.2000, 9వ క్లాస్‌లో చేరినప్పుడు రూ.3000, ఇంటర్ అయిపోయిన తర్వాత రూ.5000 అందజేస్తారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.