యాప్నగరం

UPI Lite: పిన్ లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు.. కొత్త సేవలు ప్రారంభించిన ఆర్‌బీఐ

UPI Lite: తక్కువ వాల్యూ కలిగిన పేమెంట్లను వేగంగా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ రూపాయి పంపించాలన్నా కూడా యూపీఐ పిన్ అవసరం . అంతేకాక నెట్ లేకుండా ఈ పేమెంట్లను చేయలేం. కానీ నేడు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ లైట్ సేవలతో.. పిన్ లేకుండానే పేమెంట్లను చేసుకోవచ్చు. ఇది ఆన్ డివైజ్ వాలెట్‌గా పనిచేస్తుంది. ఈ యూపీఐ లైట్ ఏమిటి..? దాని ఫీచర్లేమిటి..? అనే విషయాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..

Authored byKoteru Sravani | Samayam Telugu 21 Sep 2022, 5:58 pm

ప్రధానాంశాలు:

  • సులభతరంగా తక్కువ వాల్యూ పేమెంట్లు
  • యూపీఐ లైట్ లాంచ్ చేసిన ఆర్‌బీఐ గవర్నర్
  • పిన్ లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు
  • రోజులో అపరిమిత లావాదేవీలు చేసుకునే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RBI
ఆర్‌బీఐ
UPI Lite: తక్కువ వాల్యూ కలిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) పేమెంట్లను వేగంగా, సులభతరంగా చేసుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సరికొత్త సేవలను లాంచ్ చేశారు. యూపీఐ లైట్(UPI Lite)ను లాంచ్ చేస్తున్నట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు. యూపీఐ లైట్ అనేది ఆన్ డివైజ్ వాలెట్ ఫీచర్. ఇది ఎలాంటి యూపీఐ పిన్ అవసరం లేకుండానే రూ.200 వరకు రియల్ టైమ్‌లో పేమెంట్లు చేసుకునేలా అనుమతిస్తోంది. ప్రస్తుతం మీ వాలెట్ నుంచి కేవలం డెబిట్ అవ్వడాన్ని మాత్రమే ఇది అనుమతిస్తోంది. రీఫండ్‌లతో కలుపుకుని యూపీఐ లైట్‌కి వచ్చే అన్ని క్రెడిట్లు కూడా మీ బ్యాంకు అకౌంట్‌కే రానున్నాయి.
యూపీఐ లైట్ ఫీచర్లు..
యూపీఐ లైట్ అనేది ఆన్-డివైజ్ వాలెట్. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్ల నుంచి నేరుగా వాలెట్‌కి ఫండ్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫండ్స్‌ను యాడ్ చేసుకోవడం ద్వారా యూపీఐ లైట్‌ను వాడుకోవచ్చు. రియల్ టైమ్ పేమెంట్‌కి యూజర్లకి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ప్రకటన ప్రకారం.. రూ.200 వరకు చేసుకునే యూపీఐ పేమెంట్లకు ఎలాంటి పిన్‌‌ను నమోదు చేయాల్సివసరం లేదని తెలిసింది. యూపీఐ లైట్ బ్యాలెన్స్ మొత్తం పరిమితి రూ.2 వేల వరకు ఉంది. యూపీఐ లైట్ వాడుతూ రోజులో అపరిమిత లావాదేవీలను యూజర్లు చేసుకోవచ్చు.

ఎన్‌పీసీఐ ప్రకటన ప్రకారం.. భీమ్ యాప్‌పై మాత్రమే ప్రస్తుతం యూపీఐ లైట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 8 బ్యాంకులు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. కెనరా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు ఎన్‌పీసీఐ తెలిపింది. తక్కువ విలువ గల లావాదేవీలను సులభతరంగా, వేగంగా చేసుకునేందుకు యూపీఐ లైట్ సౌకర్యవంతమైన సొల్యుషన్ అని ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే అధిక వాల్యూ కలిగిన లావాదేవీలకు యూపీఐ వాడాల్సిందే.

Also Read : 3 బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐపై క్రెడిట్ కార్డు పేమెంట్లు లాంచ్!
Also Read : ఆ పని చేస్తున్న ఉద్యోగులను బయటికి గెంటేసిన టెక్ దిగ్గజం.. వేటు పడింది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.