యాప్నగరం

గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారికి హెచ్చరిక.. ఇలాంటి పనులు ఎప్పటికీ చేయొద్దు!

మీరు ఫోన్ పే వాడుతున్నారా? లేదంటే మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా? లేదంటే పేటీఎం ఉపయోగిస్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది.

Samayam Telugu 5 Feb 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • మీరు చెల్లింపుల కోసం యూపీఐ యాప్స్‌ను ఉపయోగిస్తూ ఉంటారా?
  • ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వాడే వారు జాగ్రత్తగా ఉండాలి
  • లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.. అకౌంట్ ఖాళీ కావొచ్చు
  • అందువల్ల ఇలాంటి పేమెంట్ యాప్స్ వాడే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gpay
మీరు ఫోన్ పే వాడుతున్నారా? లేదంటే గూగుల్ పే ఉపయోగిస్తూ ఉంటారా? ఇవి కాకపోతే పేటీఎం వినియోగిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పొరపాటుగా ఉంటే మాత్రం అకౌంట్‌లో డబ్బులు కూడా మాయం కావొచ్చు. అందుకే యూపీఐ యాప్స్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలి.
ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మోసాలతోపాటుగా యూపీఐ మోసాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటివి వాడే వారు మోసపూరిత లింక్స్‌పై క్లిక్ చేయొచ్చు. మోసగాళ్లు మెసేజ్‌ లేదా వాట్సాప్ ద్వారా ఇలాంటి లింక్స్ పంపుతూ ఉంటారు. వీటిపై క్లిక్ చేయొద్దు.

Also Read: undefined

అలాగే మోసగాళ్లు కాల్ చేసి లక్కీడ్రాలో డబ్బులు గెలుపొందారని చెబుతారు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బుల మీ అకౌంట్‌లోకి వస్తాయని మోసగిస్తారు. మీరు ఇలా పిన్ ఎంటర్ చేస్తే.. మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పంపాలంటేనే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. డబ్బులు రావాలంటే ఎలాంటి పిన్ అక్కర్లేదు. అవతలి వారు పిన్ ఎంటర్ చేసి మీకు డబ్బులు పంపుతారని గుర్తించుకోవాలి.

Also Read: undefined

అలాగే సోషల్ మీడియా లేదా వాట్సాప్ ఇంకా ఇతర మార్గాల్లో మీ బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ షేర్ చేయొద్దు. చేస్తే మాత్రం మోసపోవాల్సి రావొచ్చు. అలాగే రిమోట్ యాక్సెస్ యాప్స్‌ను కూడా ఫోన్‌లో వాడొద్దు. వీటి ద్వారా కూడా చాలా మోసాలు జరిగాయి. అందువల్ల మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. స్క్రీన్ లాక్ పెట్టుకోవాలి. కేవలం ఫోన్‌కు మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ యాప్స్‌కు కూడా లాక్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మీ పిన్ వివరాలను ఎవ్వరికీ షేర్ చేయొద్దు. అలాగే ఫేక్ కాల్స్‌కు స్పందించొద్దు. ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేయొద్దు. యూపీఐ యాప్స్‌ను ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మల్టీపుల్ పేమెంట్ అప్లికేషన్స్‌కు వాడొద్దు. నమ్మదగిన యాప్స్‌ను మాత్రమే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.