యాప్నగరం

టైమ్స్‌తో జతకట్టిన అమెరికా మీడియా ‘వైస్’

అమెరికన్ న్యూస్ బ్రాండ్ ‘వైస్ మీడియా’ కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టబోతోంది.

TNN 23 Jun 2016, 11:37 am
అమెరికన్ న్యూస్ బ్రాండ్ ‘వైస్ మీడియా’ కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు భారత మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపుతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ లాండ్ (vice land) పేరుతో టీవీ నెట్‌వర్క్‌ను త్వరలో ఇండియాలో ప్రారంభించబోతోంది. ఇందుకోసం ముంబైలో బ్యూరో, ప్రొడక్షన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. భారత్ లో ఉన్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకునే వైస్ ఇండియలోకి ప్రవేశించేందుకు టైమ్స్‌తో జతకట్టింది. వైస్‌లాండ్ టీవీలో టైమ్స్ సాయంతో లోకల్ వార్తల్ని, స్థానికంగా ఉండేవారి ఇష్టాయిష్టాలను బట్టి కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. లైఫ్ స్టైల్ కార్యక్రమాలకు పెద్ద పీట వేయబోతున్నారు. ఈ మేరకు జర్నలిస్టులను, ఫిల్మ్ మేకర్స్‌ను ఉద్యోగంలోకి తీసుకోబోతున్నారు. ఈ సందర్భంగా టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ మాట్లాడుతూ... అత్యధిక యువ జనాభాతో భారత్ ధ్రువతారగా ఎదుగుతోందన్నారు. వైస్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. వైస్ సీఈవో షేన్ స్మిత్ మాట్లాడుతూ... భారత్ లోని సంస్కృతి, సాంప్రదాయాలని తమ టీవీ నెట్ వర్క్ ద్వారా ప్రపంచమంతా తెలిసేలా చేస్తామన్నారు. వైస్... ఇండియాలో ఉన్న టైమ్స్ సంస్థలన్నింటిని ఉపయోగించుకుని తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోబోతోంది.
Samayam Telugu vice media forms jv with times group for india foray
టైమ్స్‌తో జతకట్టిన అమెరికా మీడియా ‘వైస్’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.