యాప్నగరం

అదిరిపోయే రాబడితోపాటు 25 ఏళ్లు ఉచితంగా కరెంట్ పొందండి.. ఎలా అంటే?

నెల నెలా కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకుంటే ఉచితంగానే కరెంటు పొందొచ్చు. అంతేకాకుండా మిగిలిన కరెంట్ విక్రయించొచ్చు.

Samayam Telugu 16 Sep 2020, 6:48 pm

ప్రధానాంశాలు:

  • విశాఖ ఇండస్ట్రీస్‌కు పేటెంట్
  • ఆటమ్ సోలార్ రూఫ్‌‌కు ఈ గుర్తింపు
  • సులభంగానే ఏర్పాటు చేసుకోవచ్చు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu electricity bill
విశాఖ ఇండస్ట్రీస్‌ తాజాగా తన ఆటమ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్‌కు 20 ఏళ్ల పేటెంట్ దక్కించుకుంది. ఆటమ్ అనేది సోలార్ రూఫ్. దీన్ని ఇంటి పైనా ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్.
కంపెనీ ఈ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌ను పాలీ లేదా మోనో క్రిస్టలిన్ సోలార్ సెల్స్‌, సిమెంట్ బోర్డ్స్‌తో తయారు చేసింది. చాలా కాలం మన్నికకు వస్తాయి. గట్టిగా కూడా ఉంటాయి. డైరెక్ట్‌గా ఆ సోలార్ ప్యానెల్‌ను ఇంటి పైకప్పుగా ఉపయోగించొచ్చు. లేదంటే ఇప్పటికే ఇంటి పైకప్పు ఉంటే దానిపై ఏర్పాటు చేసుకోవచ్చు.

Also Read: undefined

ఆటమ్‌కు ప్రతిష్టాత్మక యూఎల్ సర్టిఫికేషన్‌ కూడా ఉంది. బలమైన గాలులను కూడా తట్టుకుంటుంది. ఇంకా సాంప్రదాయ సోలార్ టైల్స్ మాదిరి కాకుండా ఆటమ్‌ ఏర్పాటుకు ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు. డైరెక్ట్‌గా పనిచేస్తుంది. ఇంకా మిగతా వాటి కన్నా 20 నుంచి 40 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీనికి అయ్యే ఖర్చును 4 ఏళ్లలో దీని ద్వారానే తీర్చేయవచ్చు. అందువల్ల ఇది ఆకర్షణీయ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా కనిపిస్తోంది. దీన్ని ఏకంగా 30 ఏళ్ల వరకు ఉపయోగించొచ్చు. అంటే మీరు 25 ఏళ్ల పాటు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉండదు. తమిళనాడు, మహరాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.