యాప్నగరం

జియోకి పోటీగా వొడాఫోన్ రెండు కొత్త ప్లాన్లు

రిలయన్స్ జియో ఆధిపత్యానికి కళ్లెం వేయడానికి దేశంలోని టాప్ 3 టెలీకాం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

TNN 14 Nov 2017, 4:44 pm
రిలయన్స్ జియో ఆధిపత్యానికి కళ్లెం వేయడానికి దేశంలోని టాప్ 3 టెలీకాం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఓ వైపు జియో తన ప్లాన్లలో మార్పులు చేస్తూ ధరలను స్వల్పంగా పెంచుతుంటే.. ఈ కంపెనీలు మరింత చౌకగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి రూ.458 ప్లాన్ కాగా మరొకటి రూ.509 టారిఫ్.
Samayam Telugu vodafone launches new plans of rs 458 rs 509 offers 1gb data per day and more
జియోకి పోటీగా వొడాఫోన్ రెండు కొత్త ప్లాన్లు


రూ.458 ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1జీబీ డాటాను వొడాఫోన్ అందిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 70 రోజులు. ఇక రూ.509 ప్లాన్‌కి వచ్చేసరికి.. రోజుకి 1జీబీ డాటా, అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు. ఈ రెండు ప్లాన్లలో అందిస్తోన్న కాల్స్, డాటా, ఎస్ఎంఎస్‌లు ఒకేలా ఉన్నాయి. అయితే కాలపరిమితి మాత్రేమే మారింది.

ఇదిలా ఉంటే, ఈ రెండు ప్లాన్‌లలో అందిస్తోన్న అపరిమిత కాలింగ్‌కి వొడాఫోన్ చిన్న మెలిక పెట్టింది. తాము అపరిమితం అని చెప్పినా రోజులో 250 నిమిషాల పాటు మాత్రమే ఉచితంగా మాట్లాడటానికి వీలుందని వెల్లడించింది. అలాగే ఒక వారంలో 1000 నిమిషాలకు మించి మాట్లాడటానికి వీల్లేదు. అంటే వొడాఫోన్ విధించిన పరిమితికి మించి మాట్లాడితే మీ మెయిన్ బాలెన్స్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. కాగా, రిలయన్స్ జియో కూడా రూ.459, రూ.509 ప్లాన్లను అందిస్తోంది. అయితే ఈ రెండు ప్లాన్లకు కాలపరిమితి 84 రోజులే. రూ.459 ప్లాన్‌లో రోజుకి 1జీబీ డాటా రాగా.. రూ.509 ప్లాన్‌లో రోజుకి 2జీబీ డాటా వస్తుంది. మరి ఈ సరికొత్త ప్లాన్లతో జియోకి వొడాఫోన్ ఎంత పోటీనిస్తుందో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.