యాప్నగరం

రూ. 19కే అన్‌లిమిటెడ్ కాల్స్.. 100ఎంబీ 4జీ డాటా!

దేశంలో టెలీకాం సంస్థల మధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఒక కంపెనీకి మించి మరో కంపెనీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

TNN 26 May 2017, 4:54 pm
దేశంలో టెలీకాం సంస్థల మధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఒక కంపెనీని మించి మరో కంపెనీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రకరకాల అన్‌లిమిటెడ్ కాల్స్, డాటా ఆఫర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. తాజాగా వొడాఫోన్ మరో రెండు ఆఫర్లను ప్రకటించింది. సూపర్ డే, సూపర్ వీక్ పేర్లతో వచ్చిన ఈ రెండు ఆఫర్లు అపరిమిత కాల్స్, పరిమిత 4జీ డాటాను అందిస్తున్నాయి.
Samayam Telugu std calling and 100mb data at rs 19
రూ. 19కే అన్‌లిమిటెడ్ కాల్స్.. 100ఎంబీ 4జీ డాటా!


రూ. 19కే సూపర్ డే ప్యాక్‌ కింద అపరిమిత లోకల్, ఎస్టడీ కాల్స్‌తో పాటు 100ఎంబీ 4జీ డాటాను వొడాఫోన్ అందిస్తోంది. దీని కాలపరిమితి ఒకరోజు మాత్రమే. అలాగే అపరిమిత కాల్స్ కూడా వొడాఫోన్ నెట్‌వర్క్‌పై మాత్రమే. అంటే వొడాఫోన్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు ఈ ఆఫర్ వర్తించదు. ఇక సూపర్ వీక్ ప్లాన్ కింద రెండు ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి రూ. 49 కాగా.. మరొకటి రూ. 89 ప్యాక్.

ఒక వారం కాల పరిమితితో వచ్చిన ఈ రెండు ప్యాక్‌లతో కూడా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే రూ. 49 ప్యాక్‌తో వొడాఫోన్ నుంచి వొడాఫోన్‌కు (ఎస్టీడీ, లోకల్) మాత్రమే అపరిమిత కాల్స్ చేసుకోవడం వీలవుతుంది. ఇక రూ. 89 ప్యాక్‌తో ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్యాక్‌లలోనూ 250 ఎంబీ 4జీ డాటా ఉచితం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.