యాప్నగరం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో వాట్సాప్‌లో ‘గ్రూప్ వాయిస్ కాల్స్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. సంస్థ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఇది పరిశీలన దశలో ఉంది. కొత్త సంవత్సర కానుకగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

TNN 23 Oct 2017, 3:39 pm
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో వాట్సాప్‌లో ‘గ్రూప్ వాయిస్ కాల్స్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. సంస్థ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఇది పరిశీలన దశలో ఉంది. కొత్త సంవత్సర కానుకగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది. ఫేస్‌బుక్ మెసెంజర్‌ తదితర వాటిల్లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చాట్‌ను మరింత సులభతరం చేయడానికి అదనపు హంగులు జోడించనున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వర్షన్‌ ద్వారా ఈ ఫీచర్స్‌ను అందుబాటులోకి తేనున్నారు.
Samayam Telugu whatsapp to introduce group video and voice calls soon
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..!


వాట్సాప్ బీటా వర్షన్‌లో యాప్ సైజ్ తగ్గిస్తున్నారు. ‘గ్రూప్ వాయిస్ కాల్స్’తో పాటు.. సభ్యుల్లో ఎవరైనా నంబర్ చేంజ్ చేస్తే నోటిఫికేషన్ ఇవ్వడం లాంటి అప్‌డేట్స్ కూడా రానున్నాయి. గ్రూప్‌లోని ఇతర అడ్మినిస్ట్రేటర్లు.. గ్రూప్ క్రియేటర్‌ను తీసేయకుండా చేసే ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గ్రూపులోని ఇతర పార్టిసిపెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్ట్, ఐకాన్‌ లాంటివి మార్చే అవకాశం ఇవ్వాలా.. వద్దా.. అనే అంశాన్ని కూడా అడ్మినిస్ట్రేటర్స్ నిర్ణయించవచ్చు.

యూజర్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘అన్‌సెండ్’ ఫీచర్ కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇందు కోసం రూపొందించిన ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్‌ పరిశీలన దశలో ఉంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాము పంపిన మెసేజ్‌లు, ఇమేజెస్, వీడియోలు, డాక్యుమెంట్లను 5 నిమిషాల్లోపు వెనక్కి తీసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని కూడా అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.