యాప్నగరం

రాజన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?

ఆర్బీఐ నూతన గవర్నర్ ఎంపికపై కేంద్రం కసరత్తు చేస్తోంది.

TNN 19 Jun 2016, 10:29 am
ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్ మళ్లీ బాధ్యతలు చేపట్టేందుకు సముఖంగా లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్బీఐ గవర్నర్ పదవి కోసం ఏడుగురు సభ్యుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని అధికార వర్గాల నుంచి సమాచారం అందింది. రేసులో అశోక్ లాహిరి, విజయ్ కేల్కార్ , ఉర్జిత్ పటేల్,అరుంధతి భట్టాచార్య, అశోక్ చావ్వా సుబిర్ గోకరన్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒకరిని ఎంపిక చేసి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు అప్పగించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఏడుగురిలో ప్రధానంగా ఉర్జిత్ పటేల్, అరుంధతీ భట్టాచార్యల్లో ఒకరిని ఎంపిక చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమచారం. ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా వ్యవరిస్తుండగా ...అరుంధతీ భట్టాచార్య ​ఎస్ బీఐ ఎండీగా వ్యవహరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.