యాప్నగరం

షియోమి రెడ్మి 4.. మే 23న తొలి సేల్

సరసమైన ధరలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ భారతీయుల మనసు దోచుకున్న చైనా కంపెనీ షియోమి మరో సూపర్ ఫోన్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది.

TNN 18 May 2017, 7:08 pm
సరసమైన ధరలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ భారతీయుల మనసు దోచుకున్న చైనా కంపెనీ షియోమి మరో సూపర్ ఫోన్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు మే 23 నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తున్న ఈ రెడ్మి 4 కేవలం అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత షియోమి ఫోన్లలానే ఈ రెడ్మి 4 సేల్ ఉండబోతోంది. దీని ప్రకారం ఈనెల 23న తొలి సేల్ ఉంటుంది.
Samayam Telugu xiaomi launches volte ready rs 6999 redmi 4 smartphone sale starts may 23
షియోమి రెడ్మి 4.. మే 23న తొలి సేల్


ఇప్పటికే అమెజాన్ రెడ్మి 4ఎ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తోంది. ఈ ఫోన్ సేల్ ప్రారంభమైన రోజు 5 నిమిషాల్లోనే స్టాక్ అయిపోతోంది. అప్పుడు కొనుగోలు చేయలేకపోయిన వారు మళ్లీ సేల్ వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఈ రెడ్మి 4 పరిస్థి కూడా అంతే కావచ్చు. సూపర్ ఫీచర్లతో వచ్చిన రెడ్మి 4 కోసం జనం ఎగబడటం ఖాయం. కాబట్టి తొలి సేల్ ప్రారంభమైన నిమిషంలోనే స్టాక్ అయిపోయే అవకాశం కూడా ఉంది.

షియోమి రెడ్మి 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 6,999. ఇక 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,999 కాగా.. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. అమెజాన్‌తో పాటు ఎంఐ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో మే 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రెడ్మి 4 తొలి సేల్ ప్రారంభమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.