యాప్నగరం

బిగ్ బజార్ సేల్: రూ.4వేలకే రెడ్మి 5ఎ

ఫ్లాష్ సేల్‌లో షియోమి రెడ్మి 5ఎ స్మార్ట్‌ఫోన్ దొరకలేదని బాధపడుతున్నారా.. అయితే మీకు శుభవార్త.

TNN 25 Jan 2018, 5:44 pm
ఫ్లాష్ సేల్‌లో షియోమి రెడ్మి 5ఎ స్మార్ట్‌ఫోన్ దొరకలేదని బాధపడుతున్నారా.. అయితే మీకు శుభవార్త. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు బిగ్ బజార్ రిటైల్ స్టోర్‌లో కూడా దొరకనుంది. బిగ్ బజార్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా షియోమి రెడ్మి 5ఎను విక్రయించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కేవలం రూ.4 వేలకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. వాస్తవానికి రెడ్మి 5ఎ 2జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.4,999. కానీ బిగ్ బజార్ రూ.5,499గా నిర్ణయించింది.
Samayam Telugu xiaomi redmi 5a available at discount in big bazaar sale
బిగ్ బజార్ సేల్: రూ.4వేలకే రెడ్మి 5ఎ


అయితే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ ఫ్యూచర్ పే వ్యాలెట్‌లోకి వస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ఈ క్యాష్‌ బ్యాక్‌తో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా వస్తుంది. మొత్తంగా చూసుకుంటే రూ.4 వేలకే రెడ్మి 5ఎను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 28 వరకు అందుబాటులో ఉంటుందని బిగ్ బజార్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

రెడ్మి 5ఎ స్పెసిఫికేషన్లు
☀ 5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే
☀ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్
☀ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
☀ 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
☀ 13 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
☀ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.