యాప్నగరం

Yahoo Messenger: నేటితో ముగియనున్న యాహూ మెసేంజర్ ప్రస్థానం

ఒకప్పుడు బాగా పాపులర్ మేసెజింగ్ సర్వీస్ అయిన యాహూ మెసేంజర్ ప్రస్థానం నేటి (జూలై 17)తో ముగియనుంది.

TNN 17 Jul 2018, 12:54 pm
ఒకప్పుడు బాగా పాపులర్ మేసెజింగ్ సర్వీస్ అయిన యాహూ మెసేంజర్ ప్రస్థానం నేటి (జూలై 17)తో ముగియనుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, స్నాప్‌చాట్‌ల రంగ ప్రవేశంతో యాహూ మెసేంజర్ వాడకం బాగా తగ్గిపోయింది. వాట్సాప్ లాంటి మెసేంజిగ్ సర్వీస్‌లు రోజుకో కొత్త ఫీచర్‌తో దూసుకెళ్తుంటే.. యాహూ ఢీలా పడింది. 1998, మార్చి 9న యాహూ పేజర్‌గా మొదలై.. తర్వాతి ఏడాది యాహూ మెసేంజర్‌గా మారింది. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాలను చవి చూసింది.
Samayam Telugu yahoo


ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం మొదలుపెట్టిన వారికి గూగుల్ ఎంతలా ఉపయోగపడిందో.. పదిహేనేళ్ల క్రితం ఇంటర్నెట్ వాడకం ప్రారంభించిన వారికి యాహూ అంతే ఉపయోగపడింది. యాహూ సెర్చ్, యాహూ మెసేంజర్, యాహూ న్యూస్, మెయిల్.. ఇలా అన్ని రకాల సేవలు అందించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.