యాప్నగరం

యాహూ.. ఇకపై అల్టబా

ఇంటర్నెట్ బిజినెస్ సంస్థ ‘యాహూ’ తనపేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించింది.

TNN 10 Jan 2017, 4:46 pm
ఇంటర్నెట్ బిజినెస్ సంస్థ ‘యాహూ’ తనపేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. వెరిజోన్ కమ్యూనికేషన్స్‌లో యాహూ విలీనమైన వెంటనే దానిపేరు అల్టబాగా మారుతుందని, సీఈవో మరిస్సా మేయర్ కూడా తప్పుకుంటారని యాహూ వెల్లడించింది. యాహూ డిజిటల్ అడ్వర్టైజింగ్, ఈమెయిల్, మీడియా కార్యకలాపాలతో కూడిన ఇంటర్నెట్ బిజినెస్‌ను 4.83 బిలియన్ డాలర్ల (సుమారు రూ.32వేల కోట్లు)కు వెరిజోన్ కొనుగోలు చేసింది.
Samayam Telugu yahoo will be renamed altaba post verizon acquisition
యాహూ.. ఇకపై అల్టబా


అయితే యాహూలో రెండు సార్లు భారీ సమాచార చౌర్యం జరగడంతో ఈ డీల్‌లో సవరణలు జరుగుతాయని, లేదంటే పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని భావించారు. దీనిపై వెరిజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ సోమవారం స్పందించారు. తాము యాహూను బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమాచార చౌర్యంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ డీల్‌ అమల్లోకి రాగానే బోర్డులో కొనసాగుతున్న ఇప్పటి సీఈవో మరిస్సా మేయర్‌ సహా ఐదుగురు డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్లు యాహూ వెల్లడించింది. మిగిలిన వారు ఆల్టబాలో కొనసాగుతారని తెలిపింది. ఎరిక్‌ బ్రాండెట్‌ను కొత్తబోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.