యాప్నగరం

ఆ ఆప్షన్‌తో PF డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.. ఎలా అంటే?

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే పీఎఫ్ డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు మీ పీఎఫ్ డబ్బును రెట్టింపు కూడా చేసుకోవచ్చు.

Samayam Telugu 8 Apr 2020, 4:19 pm

ప్రధానాంశాలు:

  • పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచుకునే ఛాన్స్
  • ఇలా చేస్తే అధిక వడ్డీ పొందొచ్చు
  • రిటైర్మెంట్‌లో భారీ మొత్తం పొందొచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu epfo news
ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీ భవిష్యత్‌ కోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బును రెట్టింపు చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. మీ కంపనీకి మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పెంచామని రిక్వెస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు.
మీరు మీ కంపెనీకి పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచమని రిక్వెస్ట్ పెట్టుకుంటే, దాన్ని మీ కంపెనీ ఓకే చేస్తే.. అప్పుడు ప్రతి నెలా మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీంతో మీ పీఎఫ్ డబ్బులు రిటైర్మెంట్ కల్లా పెరుగుతాయి. రెట్టింపు అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

Also Read: undefined

ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.5 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించింది. ప్రభుత్వ పథకాల్లో ఈ స్థాయిలో వడ్డీ రేటు లభిస్తున్న ఏకైక స్కీమ్ ఇదే అని చెప్పుకోవచ్చు. దీంతో మీరు మీ పీఎఫ్ అకౌంట్ కంట్రిబ్యూషన్ పెంచుకుంటే మంచి వడ్డీ రాబడి పొందొచ్చు.

Also Read: undefined

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం ప్రకారం.. ఈపీఎఫ్‌వో సభ్యులు వారి నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని పెంచుకోవడానికి వీలుంది. సాధారణంగా ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్‌కు జమవుతుంది. అలాగే కంపెనీ కూడా ఇదే మొత్తానికి సమానమైన వాటాను ఉద్యోగి ఖాతాకు జమ చేస్తుంది.

Also Read: undefined

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి వారి పీఎఫ్ అకౌంట్ కంట్రిబ్యూషన్ పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను బేసిక్ శాలరీలో 100 శాతం వరకు పెంచుకోవచ్చు.

ఒక ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని రెట్టింపు చేసుకుంటే.. అప్పుడు రిటైర్మెంట్ సమయంలో పొందే మొత్తం కూడా రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తం 12 శాతంగా ఉంది. దీన్ని 24 శాతానికి పెంచకుంటే.. అప్పుడు పీఎఫ్ డబ్బులు కూడా డబుల్ అవుతాయి. మీరు మీ పీఎఫ్ డబ్బును రెట్టింపు చేసుకుంటే మీరు పొందే వడ్డీ రాబడి కూడా పెరుగుతుంది. పీఎఫ్ అకౌంట్‌పై డబ్బులు కాంపౌండింగ్ ప్రతిపాదికన ఖాతాకు జమవుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయంలో భారీ మొత్తాన్ని తీసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.