యాప్నగరం

మార్చి 31 లోగా 2015-16, 2016-17 ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌వ‌చ్చు

2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్‌లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.

TNN 28 Mar 2018, 5:41 pm
మీరు గత రెండేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేదా? అయితే మీకు శుభవార్త‌. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్‌లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి‌గాను వేతన జీవులు తమ ఐటీ రిటర్న్‌ను సమర్పించేందుకు చివరి తేదీ జులై 31 అని ఐటీశాఖ ప్రకటించింది.
Samayam Telugu you need to file your i t return for past two financial years by march 31
మార్చి 31 లోగా 2015-16, 2016-17 ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌వ‌చ్చు

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు మార్చి 31 లోగా స‌మ‌ర్పించాలి


2015-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఫైన్ క‌ట్టి రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన గ‌డువు సైతం మార్చి 31 కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఐటీ శాఖ చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌రైన స‌మ‌యంలో రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే రిక‌వ‌రీ కోసం నోటీసులు పంప‌డంతో పాటు పెనాల్టీలు విధిస్తుంది. డీఫాల్ట్ ట్యాక్స్ పేయ‌ర్ల‌కు ప్రాసిక్యూష‌న్ నోటీసులు సైతం పంపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.