యాప్నగరం

కష్టాల్లో క్రిప్టో కరెన్సీలు.. బినాన్స్ భారీ ప్రకటన, వెనుకడుగు వేయనంటోన్న ఫౌండర్

క్రిప్టో కరెన్సీలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయి. ఏ రోజుకు ఆరోజూ తీవ్రంగా పతనమవుతూ ఆ కరెన్సీలు ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మూటగడుతున్నాయి. ఈ సమయంలో అసలు తగ్గేదేలే అంటున్నారు బినాన్స్ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంగ్‌పెంగ్ జావో. ఒకవైపు పలు క్రిప్టో ఎక్స్చేంజ్‌లు క్రిప్టో ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న ఒడిదుడుకుల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తుండగా.. బినాన్స్ మాత్రం భారీ ఉద్యోగ ప్రకటన చేసి ఆకట్టుకుంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 15 Jun 2022, 8:01 pm

ప్రధానాంశాలు:

  • బినాన్స్‌లో 2 వేల ఉద్యోగాలు
  • ప్రకటించిన సీఈవో ఛాంగ్‌పెంగ్ జావో
  • క్రిప్టో ఇండస్ట్రీలో రోడ్డున పడ్డ ఉద్యోగులకు ఆశాభావం
  • కాయిన్‌బేస్, బ్లాక్‌ఫౌ, క్రిప్టో డాట్ కామ్‌లలో లేఆఫ్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Binance Founder Changpeng Zhao
బినాన్స్ ఫౌండర్ ఛాంగ్‌పెంగ్ జావో
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బినాన్స్‌లో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఆ ఎక్స్చేంజ్ కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంగ్‌పెంగ్ జావో ప్రకటించారు. క్రిప్టో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న సమయంలో బినాన్స్ ఈ ప్రకటన చేసింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో.. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనుందని తెలుస్తోంది. అంతేకాక ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి మారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనలతో క్రిప్టో ఇన్వెస్టర్లు ప్రమాదకరమైన ఆస్తులలో పెట్టుబడులు పెట్టేందుకు నిరాసక్తి చూపుతున్నారు.
మరోవైపు బినాన్స్ రెండు వేల మందిని నియమించుకోనున్నట్టు ప్రకటించడానికి ఒక రోజు ముందు అమెరికాలోని క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అయిన కాయిన్‌బేస్ ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిపింది. తన వర్క్‌ఫోర్స్‌లో 18 శాతం మందిని అంటే 1,100 మందిని తీసేయనున్నట్టు పేర్కొంది.



Also Read : టీడీఎస్, టీసీఎస్ రూ.25 వేలు దాటిందా..? అయితే ఇక నుంచి కంపల్సరీగా..

కాయిన్‌బేస్‌తో పాటు బ్లాక్‌ఫై, క్రిప్టో డాట్ కామ్‌లు కూడా వందల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మెటా ప్లాట్‌ఫామ్స్, ఇంటెల్ కార్ప్‌లు నియామకాలకు బ్రేక్స్ వేశాయి. ఈ సమయంలో బినాన్స్ ప్రకటన ఎంతో మందికి ఊరటనిచ్చింది. ఈ ఇండస్ట్రీపై ఆశలు వదులుకుంటోన్న ఉద్యోగులకు, రోడ్డున పడ్డ ఉద్యోగులకు ఆశాభావాన్ని కలిగించింది. బినాన్స్ 2 వేల మంది ఉద్యోగులను నియమించుకునే విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.



మరోవైపు క్రిప్టో కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. బిట్‌కాయిన్ ధర 18 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇతర చిన్న కరెన్సీలు కూడా నష్టాలు పాలవుతున్నాయి. క్రిప్టో లెండార్ సెల్సియస్ నెట్‌వర్క్ తన కస్టమర్లు టోకెన్లు విత్‌డ్రా చేసుకోకుండా నిషేధం విధించడంతో.. డిజిటల్ కరెన్సీ మార్కెట్ మరింత పతనమైంది. క్రిప్టో వింటర్ ఇన్వెస్టర్లను బాగా దెబ్బకొడుతోంది. మార్కెట్ క్రాష్‌కి ముందు బిట్ కాయిన్ ధర 64 వేల డాలర్లు పలికినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం తీవ్ర బేరిష్‌ సెంటిమెంట్‌ను ఈ కరెన్సీలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

Also Read : ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ.. వివరాలు, ప్రయోజనాలు తెలుసుకోండి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.