యాప్నగరం

Crypto Updates: నష్టాల్లో బిట్ కాయిన్, ఇథీరియం.. ఈ క్రిప్టో రేటు భారీ జంప్!

Crypto New Today: క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఈరోజు నష్టాల్లోనే ఉంది. ప్రధానమైన క్రిప్టో కరెన్సీలు అన్నీ దాదాపుగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బిట్ కాయిన్, ఇథీరియం వంటి క్రిప్టోలు కూడా నష్టపోయాయి. అయితే ఒక క్రిప్టో కరెన్సీ రేటు మాత్రం పరుగులు పెట్టింది. ఏకంగా 40 శాతానికి పైగా ర్యాలీ చేసింది. కాగా క్రిప్టో మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిలో రిస్క్ చాలా ఎక్కువ.

Authored byKhalimastan | Samayam Telugu 26 May 2022, 4:13 pm

ప్రధానాంశాలు:

  • నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్
  • ఇథీరియం రేటు కూడా ఇదే దారిలో నడుస్తోంది
  • ఇతర క్రిప్టో కరెన్సీల ధరలు కూడా పడిపోయాయి
  • అయితే ఒక క్రిప్టో రేటు మాత్రం పరుగులు పెట్టింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu crypto rates today
క్రిప్టో కరెన్సీ ధరలు
NFTs: ప్రధానమైన క్రిప్టో కరెన్సీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. మే 26న ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ అయిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ రేటు రూ. 24 లక్షలకు పైన ట్రేడ్ అవుతోంది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే.. ఈ బిట్ కాయిన్ రేటు (Bitcoin Rate Today) 0.85 శాతం తగ్గింది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ వాటా మాత్రం 0.18 శాతం మేర పెరిగింది. 44.76 శాతానికి చేరింది. ఈరోజు గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 0.59 శాతం క్షీణించింది. 1.26 ట్రిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. అలాగే మొత్తం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ మాత్రం గడిచిన 24 గంటల్లో 2.03 శాతం పెరుగుదలతో 70.78 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇథీరియం ధర కూడా పడిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం రేటు 2.73 శాతం దిగి వచ్చింది. దీంతో దీని రేటు రూ. 1.58 లక్షల వద్ద కదలాడుతోంది. అలాగే టెథర్ క్రిప్టో కాయిన్ రేటు కూడా 0.03 శాతం తగ్గుదలతో రూ.81కు క్షీణించింది. కార్డానో క్రిప్టో కరెన్సీ ధర 2.21 శాతం పడిపోయింది. రూ.41 వద్ద ఉంది. బినాన్స్ కాయిన్ ధర 1.74 శాతం క్షీణతతో రూ.26,724కు తగ్గింది. ఎక్స్ఆర్‌పీ క్రిప్టో కరెన్సీ ధర 1.19 శాతం తగ్గుదలతో రూ.33కు క్షీణించింది. పోల్కడోట్ ధర 2.5 శాతం పడిపోయింది. రూ.806 వద్ద ఉంది. అలాగే డోజికాయిన్ ధర 1.32 శాతం క్షీణతతో రూ.6కు తగ్గింది.

Also Read: undefined


బిట్ కాయిన్ ధరను డాలర్లలో చూస్తే.. 30 వేల డాలర్ల కిందనే ఉంది. 29,706 డాలర్ల వద్ద కదలాడుతోంది. బిట్ కాయిన్ రేటు ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే 36 శాతం మేర క్షీణించింది. 2021 నవంబర్ నెలలో బిట్ కాయిన్ రేటు 69 వేల డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. తర్వాత అక్కడి నుంచి దీని రేటు పడిపోతూనే వస్తోంది. ఇథీరియం ధర కూడా 2 వేల డాలర్ల దిగువునే ఉంది.

పాపులర్ క్రిప్టో కరెన్సీల ధరలు పడిపోతే ఒక క్రిప్టో కాయిన్ రేటు మాత్రం పరుగులు పెట్టింది. టెరా యూఎస్‌డీ ధర ఏకంగా 40 శాతానికి పైగా పరుగులు పెట్టింది. 0.09 డాలర్లకు చేరింది. కాగా ఇటీవల ఈ క్రిప్టో కరెన్సీ రేటు పాతాళానికి పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డెవలపర్లు కొత్త టెరా బ్లాక్ చెయిన్ రూపొందిస్తామని పేర్కొంటుండటంతో ఈ క్రిప్టో కరెన్సీ రేటు మళ్లీ పైకి కదులుతోంది. ఇకపోతే క్రిప్టో కరెన్సీలు అనేవి రిస్క్ అసెట్స్ అని గుర్తు పెట్టుకోవాలి. వీటిపై రెగ్యులేటరీ అంటూ ఏమీ ఉండదు. అందువల్ల డబ్బులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.