యాప్నగరం

క్రిప్టో మార్కెట్ పతనం.. కొనే వారికి మంచి ఛాన్స్? బిట్ కాయిన్ బేజారు!

క్రిప్టో మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. బేరిష్ ట్రెండ్‌లోనే నడుస్తోంది. అందుకే ఈరోజు కూడా బిట్ కాయిన్ రేటు పడిపోయింది. మళ్లీ ఇది 30 వేల డాలర్ల కిందకు క్షీణించింది. ఇతర పాపులర్ క్రిప్టో కరెన్సీల ధరలు కూడా ఇదే దారిలో నడిచాయి. ఇథీరియం సహా ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు కూడా తగ్గాయి. కాగా బిట్ కాయిన్‌కు 33 వేల డాలర్ల వద్ద నిరోధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Authored byKhalimastan | Samayam Telugu 18 May 2022, 1:23 pm

ప్రధానాంశాలు:

  • క్రిప్టో కరెన్సీ మార్కెట్‌పై కొనసాగుతున్న ఒత్తిడి
  • ఈరోజు కూడా క్రిప్టో కరెన్సీల ధరలు పడిపోయాయి
  • బిట్ కాయిన్, ఇథీరియం వంటి పాపులర్ కాయిన్లు కూడా నష్టపోయాయి
  • క్రిప్టో పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూస్తు్న్న ఇన్వెస్టర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bitcoin rate today
క్రిప్టో కరెన్సీ మార్కెట్ బేరిష్ గుప్పిట్లోనే ఉంది. దీంతో పలు క్రిప్టో కరెన్సీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ అయిన బిట్ కాయిన్ రేటు కూడా బుధవారం 30 వేల డాలర్ల కిందకు పడిపోయింది. ఈ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ విలువ 1.57 శాతం తగ్గుదలతో 29,898 డాలర్లకు క్షీణించింది. అలాగే రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం కూడా ఇదే దారిలో నడిచింది. ఈ క్రిప్టో కాయిన్ ధర 1.68 శాతం దిగి వచ్చింది. 2,039 డాలర్ల వద్ద ఇథీరియం ట్రేడ్ అవుతోంది. అలాగే ఎక్స్ఆర్‌పీ 1.58 శాతం, సోలానా 2.29 శాతం, కార్డానో 3.3 శాతం, స్టెల్లార్ 1.91 శాతం, ఎవలంటే 2.62 శాతం, పోల్కడోట్ 5.6 శాతం చొప్పున పడిపోయాయి. ఇంకా డోజికాయిన్ కూడా 1.17 శాతం తగ్గింది. శిబు ఇను రేటు 2.19 శాతం పడిపోయింది.
బిట్ కాయిన్‌కు తొలి నిరోధం 33 వేల డాలర్ల వద్ద ఉందని ముద్రక్స్ కో ఫౌండర్, సీఈవో ఇదుల్ పటేల్ తెలిపారు. ఈ స్థాయిని అధిగమిస్తేనే బిట్ కాయిన్ రేటు పైపైకి చేరుతుందని వివరించారు. బేరిష్ మార్కెట్‌లో క్రిప్టో కరెన్సీ రేట్ల పెరుగుదల పరిమితంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే బిట్ కాయిన్ రేటు మే నెలలో ఏకంగా 21 శాతం పతనమైంది. ఏడాదిలో చూస్తే బిట్ కాయిన్ రేటు ఒక నెలలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత వారంలో క్రిప్టో కరెన్సీ మార్కెట్ భారీగా పతనమైన విషయం తెలిసిందే.

అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ పతనాన్ని ఇన్వెస్టర్లు సానుకూలముగా చూస్తున్నారు. దీన్ని మంచి కొనుగోలు అవకాశంగా భావిస్తున్నారు. అందుకే మే 7 నుంచి 13 వరకు చూస్తే గ్లోబల్ క్రిప్టో ఫండ్స్‌లోకి నిధుల వెల్లవ కనిపించింది. ఏకంగా 274 మిలియన్ డాలర్లు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే దీన్ని మంచి కొనుగోలు ఛాన్స్‌గా ఇన్వెస్టర్లు చూస్తున్నారనే విషయం అవగతం అవుతుంది.

మరోవైపు గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో 1.28 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. అదేసమయంలో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ 11.39 శాతం క్షీణతతో 77.44 బిలియన్ డాలర్లకు పతనమైంది. బిట్ కాయిన్ మార్కెట్ వాట 44.2 శాతంగా ఉంది. 7 రోజుల్లో బిట్ కాయిన్ రేటు 4.7 శాతం తగ్గింది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.