యాప్నగరం

Bitcoin Rate: డోజికాయిన్ దుమ్మురేపింది.. ఇతర క్రిప్టో కరెన్సీల రేట్లు ఇలా

Cryptocurrency News: క్రిప్టో మార్కెట్ ఈరోజు లాభాల్లోనే ఉంది. దాదాపు అన్ని క్రిప్టో కాయిన్లు గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. బిట్ కాయిన్, ఇథీరియం వంటి వాటి ధరలు స్వల్పంగా పైకి కదిలాయి. అలాగే డోజికాయిన్ ధర మాత్రం పరుగులు పెట్టింది. 6 శాతానికి పైగా ర్యాలీ చేసింది. అలాగే ఇతర క్రిప్టోల రేట్లు కూడా ఇదే దారిలో నడిచాయి. లాభాల్లోనే ఉన్నాయి. కాగా క్రిప్టో కరెన్సీలను రిస్కీ అసెట్స్ అని గుర్తు పెట్టుకోవాలి.

Authored byKhalimastan | Samayam Telugu 28 May 2022, 4:21 pm

ప్రధానాంశాలు:

  • లాభాల్లో కదలాడుతున్న గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్
  • పలు క్రిప్టో కరెన్సీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి
  • బిట్ కాయిన్, ఇథీరియం రేట్లు స్వల్పంగా పైకి కదిలాయి
  • డోజికాయిన్ ధర ఎక్కువగా పెరిగింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu crypto news
భారీగా పెరిగిన డోజికాయిన్
Crypto Investment Plans: గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఈరోజు దాదాపుగా ఫ్లాట్‌గానే ఉంది. మే 28న ప్రధానమైన క్రిప్టో కరెన్సీలైన బిట్ కాయిన్, ఇథీరియం, సొలానా వంటివి పైకి చేరాయి. అలాగే ఇంకా చాలా వరకు క్రిప్టోలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. గత 24 గంటల్లో గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ 1.17 శాతం పెరుగుదలతో 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ట్రాకింగ్ వెబ్‌సైట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం.. బిట్ కాయిన్ రేటు 0.56 శాతం పెరిగింది. అయినా కూడా ధర ఇంకా 29 వేల డాలర్ల కిందనే ఉంది. 28,849 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే గత వారం రోజుల్లో చూస్తే ఈ క్రిప్టో కరెన్సీ విలువ 1.33 శాతం తగ్గింది.
‘బిట్ కాయిన్ 30 వేల డాలర్ల మార్క్‌ను దాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈథర్‌పై చాలా ఒత్తిడి నెలకొంది. దీని రేటు 1700 డాలర్ల కిందకు పడిపోయింది. లేయర్ 1 కాయిన్స్ అంటే సొలానా, ఎవలంటే వంటివి డబుల్ డిజిట్ నష్టాల్లో ఉన్నాయి’ అని బైయూకాయిన్ సీఈవో శివమ్ ఠక్రాల్ తెలిపారు. ఈథర్ రోజంతా 1800 డాలర్ల కిందనే ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఈ క్రిప్టో కరెన్సీ విలువ 2.2 శాతం పెరిగింది. ఈథర్ ధర ఈరోజు 1767 డాలర్ల వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఇథీరియం ధర 10 శాతం మేర పడిపోయింది.


‘క్రిప్టో ఒక్కటి మాత్రమే బేర్ దశలో లేదు. చాలా పేరున్న టెక్ స్టాక్స్‌ కూడా భారీగా పతనమయ్యాయి. దీనికి పలు స్థూల ఆర్థిక అంశాలు కారణంగా ఉంటాయి. దీని వల్ల క్రిప్టో మార్కెట్‌తోపాటు ఇతర మార్కెట్లపై కూడా ఒత్తిడి నెలకొంది. మార్కెట్లు రానున్న కాలంలో కూడా ఒదిదుడుకులమయంగా ఉండొచ్చు. ఇన్వెస్టర్లు వారి పొజిషన్లలో ఉండాలి’ ఠక్రాల్ వివరించారు.

గత 24 గంటల్లో బిట్ కాయిన్ రేటు 0.56 శాతం పెరిగింది. 28,849 డాలర్ల వద్ద ఉంది. ఇథీరియం రేటు 2.22 శాతం పైకి కదిలింది. 1767 డాలర్లకు చేరింది. టెథర్ ధర స్థిరంగా ఉంది. 0.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్‌డీ కాయిన్ రేటు ఒక డాలర్‌గా ఉంది. 0.01 శాతం పెరిగింది. ఎక్స్ఆర్‌పీ ధర 1.63 శాతం పెరిగింది. 0.38 డాలర్లకు చేరింది. కార్డానో ధర 1.84 శాతం పెరిగింది. 0.4 డాలర్లకు ఎగసింది. సొలానా కాయిన్ రేటు 3.9 శాతం పెరుగుదలతో 41 డాలర్లకు ఎగసింది. డోజికాయిన్ ధర 6.7 శాతం పరుగులు పెట్టింది. 0.08 డాలర్లకు చేరింది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.