యాప్నగరం

Gold Rate in Hyderabad: వినాయక చవితి రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంత?

Gold Rate in Hyderabad: బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర జిగేల్‌మంది. దేశవ్యాప్తంగా ఉన్న బులియన్ మార్కెట్లలో నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుపుకుంటోన్న తరుణంలో ఈ ధరలు పైకి ఎగిశాయి. అయితే ధరల పెరుగుదల కాస్త తక్కువగానే ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి అనుకూలమైన సంకేతాలు లేవు. అక్కడ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 31 Aug 2022, 6:45 am

ప్రధానాంశాలు:

  • పెరిగిన బంగారం, వెండి ధరలు
  • గత మూడు రోజులుగా తగ్గిన ధరలు
  • దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు
  • గ్లోబల్ మార్కెట్లలో అనుకూలంగా లేని సంకేతాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gold Prices
బంగారం ధరలు
Gold Rate in Hyderabad: బంగారం ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న తరుణంలో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 ఎగిసి రూ.51,540గా పలుకుతోంది. సిల్వర్ రేటు కూడా నేడు పెరిగింది. కేజీ సిల్వర్ ధరపై రూ.100 పెరగడంతో.. ఈ రేటు రూ.60,100కి చేరుకుంది.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరగగా.. సిల్వర్ రేట్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.100 పెరిగి రూ.47,400కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.51,690గా నమోదైంది. దేశ రాజధానిలో బంగారం ధర పెరగగా.. సిల్వర్ రేటు మాత్రం స్థిరంగా నమోదైంది. అక్కడ కేజీ సిల్వర్ రేటు కేవలం రూ.54 వేలు మాత్రమే.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇతర నగరాలలో కూడా ఇదే ట్రెండ్ నమోదవుతోంది. బెంగళూరులో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో రూ.47,260గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,590కి చేరుకుంది. సిల్వర్ రేటు కూడా బెంగళూరులో రూ.100 పెరిగి కేజీ రూ.60,100గా నమోదైంది.

Also Read : Cooperative Banks: తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా, పెనాల్టీలతో చుక్కలు చూపించింది!

చెన్నై మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల కాస్త ఎక్కువగా ఉంది. అక్కడ 22 క్యారెట్ల, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగాయి. ఈ రేట్లు చెన్నైలో రూ.47,900గా, రూ.52,250గా నమోదయ్యాయి. చెన్నైలో సిల్వర్ రేటు కూడా రూ.100 పెరిగి రూ.60,100గా ఉంది.

అన్ని బులియన్ మార్కెట్లతో పాటు విజయవాడలో కూడా ధరల పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.100 పెరిగి రూ.47,250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.51,540గా రికార్డయింది. విజయవాడలో సిల్వర్ రేటు రూ.60,100గా ఉంది.

Also Read : EPFO: ఈపీఎఫ్ఓలో చేరాలంటే రూ.15 వేల జీతం అవసరం లేదా..? ఈపీఎఫ్ఓ కీలక ప్రతిపాదన

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.