యాప్నగరం

షాకిస్తున్న బంగారం ధర.. దూసుకెళ్తున్న వెండి.. లేటెస్ట్ రేట్లు ఇలా!

బంగారం ధర దూసుకెళ్తోంది. పసిడి ధర ఐదు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దీంతో పండుగ సీజన్‌లో బంగారం కొనే వారికి ప్రతికూల ప్రభావం పడనుంది. మరోవైపు వెండి కూడా ఇదే దారిలో నడుస్తోంది.

Samayam Telugu 9 Nov 2020, 6:33 am

ప్రధానాంశాలు:

  • పసిడి పైపైకి
  • వెండి ధరదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లోనూ పరుగు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold price today
పసిడి ప్రేమికులకు షాక్. పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర గత ఐదు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. గత ఐదు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరుగుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.770 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,020కు ఎగసింది.

Also Read: undefined

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.690 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.65,410కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 1956 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.94 పెరుగుదలతో 25.90 డాలర్లకు ఎగసింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.