బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు మళ్లీ పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కూడా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX మార్కెట్లో బంగారం ధర బుధవారం కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గుదలతో రూ.47,110కు పడిపోయింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. వెండి రేటు రూ.250 తగ్గుదలతో కేజీకి రూ.63,330కు క్షీణించింది.
Also Read: undefined
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేలచూపులు చూస్తోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గుదలతో 1803 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి కూడా క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 23.81 డాలర్లకు పడిపోయింది.
కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.