యాప్నగరం

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి వెలవెల.. లేటెస్ట్ రేట్లు ఇవే!

బంగారం ధర వెలవెలబోయింది. పసిడి ధర పడిపోయింది. బంగారం ధర గత రెండు రోజుల్లో భారీగానే తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి కదిలింది.

Samayam Telugu 21 Sep 2020, 7:19 am

ప్రధానాంశాలు:

  • తగ్గిన బంగారం ధర
  • వెండి పతనం
  • గ్లోబల్ మార్కెట్‌లో పసిడి జిగేల్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu today gold rate
పసిడి ప్రేమికులకు శుభవార్త. పసిడి పడిపోయింది. బంగారం ధర భారీగా తగ్గింది. వెలవెలబోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశమని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి కూడా ఇదే బాటలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది.
హైదరాబాద్ మార్కెట్‌లో గత రెండు రోజుల్లో బంగారం ధర భారీగానే తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,550కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.430 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,090కు క్షీణించింది.

Also Read: undefined

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత రెండు రోజుల కాలంలో ఏకంగా రూ.1,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.67,800కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 1957 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 26.96 డాలర్లకు క్షీణించింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.