యాప్నగరం

Gold Rate: రూ.34 వేలకు చేరువగా బంగారం ధర.. హైదరాబాద్‌లో ధరలు ఇలా..

పసిడి ధరలు జోరు కొనసాగిస్తున్నాయి. వరసగా మూడో రోజూ బంగారం ధర పెరిగింది. బుధవారం రూ. 65 రూపాయలు పెరిగి రూ. 33,190కి చేరువైంది.

Samayam Telugu 17 Jan 2019, 9:49 am
బంగారం ధరలు వరసగా మూడో రోజూ మెరిశాయి. మంగళవారం పెరిగిన ధర (రూ. 25)తో పోలిస్తే బుధవారం (జనవరి 16) పసిడి ధర దాదాపు 3 రెట్లు పెరిగి 34,000కు చేరువైంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.65 పెరుగుదలతో రూ.33,190కు చేరింది. బంగారం వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పసిడి ధర పైపైకి వెళుతోంది. రెండు రోజుల్లో పసిడి ధర రూ. 250 పెరగడం గమనార్హం. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 పెరుగుదలతో రూ.33,190కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.33,040కు చేరింది.
Samayam Telugu jewellery


బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. కిలో వెండి ధర బుధవారం మూడు రెట్లు పెరిగింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.40,200కు చేరింది. నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ కొనసాగుతోంది.

ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.25,400 వద్దే కొనసాగుతుండటం గమనార్హం. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.77,000గా.. అమ్మకం ధర రూ.78,000గా స్థిరంగా కొనసాగాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,400 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,910 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,300 వద్ద కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.