యాప్నగరం

బంగారం, వెండి కొనే వారికి శుభవార్త.. రూ.1,000 వరకు పడిపోయిన ధరలు!

బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. పసిడి రేటు ఈరోజు పడిపోయింది. హైదరాబాద్‌లో గత రెండో రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

Samayam Telugu 28 Jan 2022, 7:33 am

ప్రధానాంశాలు:

  • బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట
  • దిగివచ్చిన పసిడి రేటు.. వెలవెలబోయిన వెండి ధర
  • కానీ గ్లోబల్ మార్కెట్‌లో పెరిగిన రేట్లు
  • రూ.1000 వరకు పడిపోయిన బంగారం వెండి ధరలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold price today
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. దీంతో బంగారం వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు పెరిగినా దేశీ మార్కెట్‌లో ధరలు తగ్గడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 చొప్పున తగ్గాయి. దీంతో పసిడి రేటు వరుసగా రూ.49,650కు, రూ.45,500కు దిగివచ్చాయి. వెండి ధర కూడా నేలచూపులు చూసింది. కేజీ వెండి రేటు రూ.1000 పతనమైంది. దీంతో సిల్వర్ రేటు రూ.63,200కు క్షీణించింది. ముంబైలో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 తగ్గుదలతో రూ. 49,640కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ. 45,500కు క్షీణించాయి. వెండి రేటు రూ. 1000 క్షీణతతో రూ. 63,200కు తగ్గింది.

Also Read: undefined

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర వెలవెలబోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.460 పడిపోయింది. దీంతో బంగారం ధర రూ. 49,640కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈ పసిడి రేటు రూ.400 తగ్గుదలతో రూ. 45,500కు క్షీణించింది. దీంతో పసిడి రేట్ల రెండు రోజుల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.800 తగ్గుదలతో రూ.67,700కు పడిపోయింది.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1794 డాలర్లకు పెరిగింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 22.73 డాలర్లకు ఎగసింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుందని తెలుసుకోవాలి.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.