Gold Price Today: భారత్‌లో సాధారణంగా బంగారానికి డిమాండ్ భారీగా ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో భారతీయులు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అవి వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీనికి తగ్గట్లే గిరాకీ భారీగా ఉంటుంది. అయితే గోల్డ్‌ను భారత్ ఎక్కువగా విదేశాల్లో గోల్డ్ బ్యాంకుల నుంచి దిగుమతి చేసుకుంటుంటుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌కు బంగారం దిగుమతులు తగ్గాయి. అంటే డిమాండ్ తగ్గడంతోనే ఇలా జరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్- అక్టోబర్ మధ్యలో గోల్డ్ దిగుమతులు ఏకంగా 17 శాతం పడిపోయి.. 24 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో ఇది 29 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా భారీగా క్షీణించాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే ఏకంగా 34 శాతానికిపైగా సిల్వర్ దిగుమతి తగ్గిపోయింది. అయితే మొత్తంగా 7 నెలల్లో చూసుకుంటే బంగారంతో పోలిస్తే వెండికి మంచి గిరాకీనే లభించింది.
ఇదే సమయంలో మరి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయంగా కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1750 డాలర్ల దిగువకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 21.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.81 వద్ద కొనసాగుతోంది. ఇది మరింత పతనమయ్యే సూచనలు మెరుగ్గా ఉన్నాయి. ఇటీవల ఒక దశలో రూపాయి విలువ రూ.83 లెవెల్స్‌కు కూడా పతనమైంది.
Also Read:పోస్టాఫీస్‌లో మీకు అకౌంట్ ఉందా? ఈ నంబర్ సేవ్ చేసుకోండి.. చిటికెలో..!
ఇక మన బులియన్ మార్కెట్లో చూసుకుంటే బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ.10 మేర పెరిగి రూ.48,560 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,980 వద్ద ఉంది. నాలుగు రోజులుగా బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే.. అంతకుముందు వారం రోజులు మాత్రం రేట్లు పడిపోయాయి.
ఇక సిల్వర్ విషయానికి వస్తే క్రితం రోజుతో పోలిస్తే ఎలాంటి మార్పు కనిపించలేదు. వరుసగా రెండు రోజుల్లో రూ.700 మేర రేటు తగ్గగా.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.67,500 వద్ద ఉంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో ఏకంగా రూ. 1700 మేర వెండి ధర పెరిగింది.
అయితే ఇప్పుడు అందరి దృష్టి యూఎస్ ఫెడ్‌పైనే ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుతున్న వేళ వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తుందా? లేదా మరింత కఠినంగానే వ్యవహరిస్తుందా అన్నది తెలియాలి. అయితే ఈసారి అప్పట్లా కాకుండా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే మళ్లీ డాలర్ పుంజుకొని.. గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 13-14 తేదీల్లో యూఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది.
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read: ఒకటో తేదీ వచ్చేస్తుంది.. ఆ పనులన్నీ వెంటనే చేసేయండి.. మార్పులు ఇవే..

- Read Latest Business News and Telugu News