యాప్నగరం

Gold price Today: మళ్లీ రూ.32వేల పైకి పసిడి ధర.. హైదరాబాద్‌లో ధరలు ఇలా..

అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో బులియన్ మార్కెట్లో బంగారం ధర గురువారం రూ.90 రూపాయలు పెరిగింది.

Samayam Telugu 23 Nov 2018, 9:08 am
వరసగా మూడు రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం (నవంబరు 22) ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి. స్థానిక నగల వ్యాపారుల కొనుగోళ్లు వెల్లువెత్తడం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో బులియన్ మార్కెట్లో బంగారం ధర గురువారం రూ.90 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,950 నుంచి రూ.32,040కి పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడ పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ట్రేడింగ్‌లో రూ.200 పెరిగిన కిలో వెండి ధర రూ.37,800 నుంచి రూ.38,000 చేరింది.
Samayam Telugu gold Rates


పసిడి ధరలు రూ.90 మేర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,890కి చేరింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది.

ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే.. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.11 శాతం పెరిగి 1,224.02 నుంచి 1228 డాలర్లకు చేరింది. మరోవైపు వారంతపు డెలివరీ ధరలు రూ.302 పెరిరి రూ.36,888 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,120 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,580 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,300 వద్ద కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.