యాప్నగరం

Gold Price: దిగొచ్చిన 'పసిడి'.. స్తబ్దుగా 'వెండి'

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,490 వద్ద ట్రేడ్ అవుతోంది.

Samayam Telugu 15 Nov 2018, 9:19 am
అంతర్జాతీయంగా బంగారం ధరలు బలహీనంగా ఉండటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబరు 14) బంగారం ధరలు తగ్గాయి. దీంతో వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గినట్టయింది. 10 గ్రామలు బంగారం ధర రూ.150 తగ్గింది. బంగారం ధర తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,050 నుంచి రూ.31,900 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,900 నుంచి 31,750 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,202.08 అమెరికా డాలర్ల వద్ద స్థిరపడింది.
Samayam Telugu gold


బుధవారం నాటి ట్రేడింగ్‌లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కిలో వెండి రూ.37,450 వద్దే కొనసాగుతోంది. ఇక వారాంతపు డెలివరీ వెండి ధర రూ.443 తగ్గి రూ.36,219 కి చేరింది. 100 వెండి నాణేల ధర కూడా రూ.1000 తగ్గడంతో.. కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,490 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,000 గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.