యాప్నగరం

పసిడి పరుగులకు బ్రేక్.. దిగొచ్చిన ధరలు

ఒకవైపు పసిడి ధరలు తగ్గగా.. వరుసగా పతనమవుతున్న వెండి ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. దీంతో బులియన్ మార్కె‌ట్‌లో రూ.310 పెరిగిన కిలో వెండి ధర రూ.39,500కి చేరింది.

Samayam Telugu 2 Nov 2018, 5:15 pm
వరుసగా మూడు రోజులపాటు పెరిగిన బంగారం ధరలు.. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో.. శుక్రవారం (నవంబరు 2) దిగొచ్చాయి. ఈ మేరకు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,780 నుంచి రూ.32,630 దిగొచ్చింది. ఒకవైపు పసిడి ధరలు తగ్గగా.. వరుసగా పతనమవుతున్న వెండి ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. దీంతో బులియన్ మార్కె‌ట్‌లో రూ.310 పెరిగిన కిలో వెండి ధర రూ.39,500కి చేరింది.
Samayam Telugu gold


తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 150 రూపాయలు తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,630 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,480 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. నిన్నటి ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0..03 శాతం తగ్గి 1,222.41 కి చేరింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది.

మరో రెండు రోజుల్లో (నవంబరు 5) 'ధన్‌తేరాస్', ఆ తర్వాత దీపావళి (నవంబరు 7) నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం లేకపోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.