యాప్నగరం

Gold Rate: ధన త్రయోదశి.. పెరిగిన బంగారం ధరలు

ధన త్రయోదశి సందర్భంగా బంగారం ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఏ మాత్రం తగ్గలేదు ఆరేళ్ల గరిష్ఠం వద్దే ఊగిసలాడుతోంది.

Samayam Telugu 5 Nov 2018, 12:37 pm
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. పసిడి ధర బులియన్ మార్కెట్‌లో గత ట్రేడింగ్‌లో మరోసారి ఆరేళ్ల గరిష్ఠస్థాయి (రూ.32,940) కి చేరువకు వెళ్లి రూ.32,780 వద్ద ట్రేడైంది. అనంతరం రూ.150 తగ్గి రూ.32,650 వద్ద ముగిసింది. అయితే ఓ దశలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.32,550, 22 క్యారెట్ల ధర రూ.32,400 వద్ద ట్రేడ్ అయ్యాయి. కాని డిమాండ్ పెరగడంతో కోలుకున్న బంగారం ధర చివరకు రూ.100 పెరిగింది. చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి.
Samayam Telugu gold Rates


అంతకు ముందు ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.20 పెరిగిందన్నమాట. వెండి ధర రూ.70 తగ్గి రూ.39,530 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,233.80 డాలర్ల నుంచి 1,233.20 డాలర్లకు దిగొచ్చింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది.

నవంబరు 5న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు
ఢిల్లీ రూ.31050 రూ.33208
ముంబయిరూ.31100 రూ.33262
చెన్నైరూ.30280రూ.32385
కోల్‌కతారూ.31300రూ.33475
బెంగళూరురూ.29800రూ.31871
హైదరాబాద్రూ.30390రూ.32502
కేరళరూ.29650రూ.31711

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.