యాప్నగరం

Gold Rate: 'ధన త్రయోదశి' రోజునా పెరిగిన బంగారం ధర

రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం.. బంగారు కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధరలు దేశీయంగా రూ.40 పెరిగాయి.

Samayam Telugu 6 Nov 2018, 8:52 am
సోమవారం ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) రోజున కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం.. బంగారు కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధరలు దేశీయంగా రూ.40 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.40 పెరగడంతో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,690 వద్ద; 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,540 వద్ద కొనసాగుతున్నాయి.
Samayam Telugu gold rates


అంతకు ముందు ట్రేడింగ్‌ (శనివారం)లో బంగారం ధర రూ.20 పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర రూ.10 పెరిగి రూ.39,540 కి చేరింది. అయితే వారాంతపు ఆధారిత డెలివరీ ధర 183 రూపాయలు తగ్గి రూ.38,637 కి పడిపోయింది.

మంగళవారం (నవంబరు 6) అమెరికా కాంగ్రెసెషనల్ ఎలక్షన్స్ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమవడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,232.63 వద్ద స్ఠిరంగా ఉండగా.. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,233.5 వద్ద నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.