యాప్నగరం

Gold Price: తగ్గిన బంగారం ధర.. నిలకడగా వెండి

బంగారం ధర శుక్రవారం ట్రేడింగ్‌లో పతనమైంది. మరోవైపు డిమాండ్ కొనసాగడంతో వెండి ధర వరుసగా రెండోరోజు స్థిరంగా ఉంది.

Samayam Telugu 18 Nov 2018, 12:31 am
వరుసగా రెండు రోజులు దిగొచ్చి గురువారం పెరిగిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పతనమైంది. అంతర్జాతీయంగా రూపాయి బలపడటంతో పాటు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గటంతో బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 16న) 10 గ్రాముల బంగారం ధర 235 రూపాయల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,250 నుంచి 32,015కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100 నుంచి 31,865గా నమోదైంది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది.
Samayam Telugu gold


ఇక గురువారం పుంజుకున్న వెండిధర శుక్రవారం సైతం కొనసాగింది. పరిశ్రమల నుంచి డిమాండ్ ఉండటంతో నేటి ట్రేడింగ్‌లో కేజీ వెండి ధర 37,900 వద్ద స్థిరంగా ఉంది. ఇక వారాంతపు డెలివరీ వెండి ధర రూ.147 పెరిగింది. కేజీ ధర 36,671 నుంచి 36,818కి చేరింది. 100 వెండి నాణేల ధర గత రెండు రోజుల మాదిరిగానే శుక్రవారం సైతం కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,150 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,250 వద్ద కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.