యాప్నగరం

Gold Rates Today: పసిడికి 'పండుగ' కళ.. మరోసారి గరిష్ఠానికి చేరువగా

నవంబరు 5న 'ధన్‌తేరాస్', నవంబరు 7న దీపావళి పండుగలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి.

Samayam Telugu 31 Oct 2018, 9:24 am
ధన్ తేరాస్, దీపావళి పండుగల నేప‌థ్యంలో దేశీయ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బంగారం ధరలు ఊపందుకున్నాయి. సోమవారం స్థిరంగా ఉన్న ధరలు మంగళవారం రూ.70 పెరిగాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,550 నుంచి రూ.32,620కి ఎగబాకింది. దీంతో అక్టోబరు 25న నమోదైన 6 ఏళ్ల గరిష్ఠానికి (రూ.32,625) చేరువగా వచ్చినట్లైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. వెండి ధర రూ.260 తగ్గడంతో మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.39,240 వద్ద ట్రేడ్ అవుతోంది.
Samayam Telugu gold rates


దేశ రాజధాని ఢిల్లీలో 70 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,620 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,470 వద్ద ఉంది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.24,900 కి చేరింది.

అంతర్జాతీయంగా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ద భయాల మధ్య బంగారం ధర పతనమైంది. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.4 శాతం మేర తగ్గి 1,224.80 నుంచి 1,224.80 డాలర్లకు పతనమైంది.

నవంబరు 5న 'ధన్‌తేరాస్', నవంబరు 7న దీపావళి పండుగలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే ధన్‌తేరాస్ లోపు బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు. గతేడాది ధన్‌తేరాస్ సందర్భంగా 10 గ్రా. బంగారం ధర రూ.30,000 స్థాయికి వచ్చిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.