యాప్నగరం

Today Gold Rate: పసిడి ధగధగలు.. 2 నెలల గరిష్టానికి బంగారం ధరలు.. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Rates : బంగారం ధర భగభగమంటోంది. పెరుగుతూనే వస్తోంది. ఈ రోజు కూడా పసిడి రేటు పైపైకి కదిలింది. బంగారం ధర దేశీ మార్కెట్‌లో పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం గోల్డ్ రేటు వెలవెలబోయింది. అమెరికా డాలర్ బలపడటం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరపై ప్రభావం పడింది. అయితే దేశీ మార్కెట్‌లో మాత్రం గోల్డ్ దిగుమతి సుంకాల పెంపు ప్రభావం వల్ల బంగారం ధరలు పైపైకి చేరుతున్నాయి.

Authored byKhalimastan | Samayam Telugu 4 Jul 2022, 7:42 pm

ప్రధానాంశాలు:

  • బంగారం ధర పరుగులు పెడుతోంది
  • ఈరోజు కూడా పైకి కదిలిన గోల్డ్
  • 2 నెలల గరిష్టానికి చేరిన పసిడి
  • గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం సీన్ రివర్స్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold
కొండెక్కిన బంగారం
Gold Price Today: బంగారం ధరలు పెరుగుతూనే వెళ్తున్నాయి. ఈరోజు కూడా పసిడి పరుగు కొనసాగింది. బంగార ధర నేడు 2 నెలల గరష్ట స్థాయికి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర సోమవారం 0.4 శాతం పైకి చేరింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,117కు చేరింది. శుక్రవారం రోజున బంగారం ధర ఒకేసారి 3 శాతం లేదా రూ. 1500 మేర ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. సుంకం 5 శాతం మేర పైకి చేరింది. వాణిజ్య లోటును తగ్గించడానికి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దేశీ మార్కెట్‌లో పసిడి రేటు జిగేల్ అని మెరుస్తూ ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర నేడు వెలవెలబోయింది. పసిడి రేటు 0.2 శాతం మేర పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1807 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా డాలర్ పుంజుకోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే బాండ్ ఈల్డ్ పడిపోవడం వల్ల పసిడి ధరలకు మద్దతు లభించింది. కాగా బాండ్ ఈల్డ్ నెల రోజుల్లో చూస్తే కనిష్ట స్థాయికి తగ్గింది.

Also Read: undefined

ఈటీఎఫ్ పెట్టుబడులు కూడా బలహీనంగానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ 0.8 శాతం తగ్గింది. 1041 టన్నులకు తగ్గింది. యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్ (కమొడిటీస్, హెచ్ఎన్ఐ, ఎన్ఆర్ఐ అక్విజిషన్స్) ప్రతితమ్ పట్నాయక్ మాట్లాడుతూ.. బలమైన డాలర్ బంగారంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. పసిడి రేటుపై కొన్ని రోజులుపాటు ఒత్తిడి కొనసాగవచ్చని పేర్కొన్నారు. 1800 డాలర్ల స్థాయి కిందకు పసిడి వస్తే.. అప్పుడు గోల్డ్ రేటు 1780 - 1760 డాలర్ల స్థాయికి క్షీణించొచ్చని తెలిపారు. పసిడి రేటు 1845 డాలర్ల పైకి చేరితేనే ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు గోల్డ్ జువెలరీ సంస్థలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని దిగుమతి సుంకాల పెంపు అంశంపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతున్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్ ఎంపీ మాట్లాడుతూ.. మోదీ సర్కార్ గోల్డ్ దిగుమతి సుంకాల పెంపు వల్ల జువెలరీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం పన్ను వసూళ్ల రూపంలో చాలా ఆదాయాన్ని కోల్పోవలసి రావొచ్చన్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.