యాప్నగరం

మహిళలకు అదిరిపోయే శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఢమాల్!

బంగారం ధర పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు రూ.800 పతనమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.

Samayam Telugu 1 Mar 2021, 6:49 am

ప్రధానాంశాలు:

  • తగ్గిన పసిడి
  • వెండి కిందకు
  • రూ.800 డౌన్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold news
పసిడి ప్రేమికులకు ఒకటో తేదీ శుభవార్త. బంగారం ధర నెల ఆరంభంలోనే పడిపోయింది. పసిడి వెలవెలబోయింది. దిగొచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 పడిపోయింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.560 తగ్గుదలతో రూ.42,690కు దిగొచ్చింది.

Also Read: undefined

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. నేలచూపులు చూసింది. వెండి ధర కేజీకి రూ.800 పతనమైంది. దీంతో రేటు రూ.72,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.62 శాతం పెరుగుదలతో 1739 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.6 శాతం పెరుగుదలతో 26.88 డాలర్లకు ఎగసింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.