యాప్నగరం

బంగారం ధర వెలవెల.. వెండి రేటు డౌన్!

బంగారం ధర మళ్లీ తగ్గింది. పసిడి పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోకూ ఇదే ట్రెండ్ కొనసాగింది. బంగారం, వెండి ధరలు తగ్గాయి.

Samayam Telugu 28 Nov 2020, 6:40 am

ప్రధానాంశాలు:

  • తగ్గిన పసిడి
  • వెండిదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold price
బంగారం ధర మళ్లీ తగ్గింది. నిన్న స్వల్పంగా పైకి కదిలిన బంగారం ధర ఈరోజు మళ్లీ దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 దిగొచ్చింది. రూ.49,580కి క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 తగ్గుదలతో రూ.45,450కు పడిపోయింది.

Also Read: undefined

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.64,700కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 1800 డాలర్ల కిందకు వచ్చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 1.24 శాతం తగ్గుదలతో 1783 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 2.92 శాతం తగ్గుదలతో 22.68 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.