యాప్నగరం

ఓరినాయనో.. రూ.800 పతనమైన బంగారం ధర..!

బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈ రోజు కూడా డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర మార్నింగ్ సెషన్‌లో 0.05 క్షీణతతో 10 గ్రాములకు రూ.37,551కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.

Samayam Telugu 11 Aug 2020, 3:47 pm
బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈ రోజు కూడా డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర మార్నింగ్ సెషన్‌లో 0.05 క్షీణతతో 10 గ్రాములకు రూ.37,551కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.
Samayam Telugu gold rate falls today sixth day in a row silver prices decline
ఓరినాయనో.. రూ.800 పతనమైన బంగారం ధర..!


రూ.800 పతనం

బంగారం ధర గత ఆరు రోజుల్లో ఏకంగా రూ.800 పడిపోయింది. పసిడి ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 స్థాయికి వెళ్లిపోయింది. అంటే మూడు నెలల కాలంలోనే బంగారం ధర ఏకంగా రూ.2,450 పడిపోయింది.

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

నెల గరిష్టానికి పసిడి

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారంలో నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1484 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.

ఫెడ్ వైపు చూపు

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది. ఫెడరల్ రిజర్వు ఈ సారి వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి.

Also Read: క్రెడిట్ కార్డు ఉందా? మీకు 11 లాభాలు.. అవేంటో తెలుసుకోండి!

రూపాయి ఎఫెక్ట్

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతూ ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం ధర దిగువునే కదలాడుతోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం. దీంతో దేశీ మార్కెట్‌లో పసిడి వెలవెలబోతోంది. రూపాయి గత రెండు వారాల్లో 1.3 శాతం మేర బలపడింది.

టారిఫ్ భయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను వణికిస్తూనే ఉన్నారు. మరోదఫా టారిఫ్‌ల విధింపునకు గడువు దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్ 16 నుంచి చైనా దిగుమతులపై కొత్ టారిఫ్‌లు అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాలు టారిఫ్‌ల గడువు పొడిగింపు దిశగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

Also Read: SBI శుభవార్త.. లోన్‌‌‌పై రూ.2 లక్షలు ఆదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.