యాప్నగరం

Gold Price: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి!

Gold Rate in Hyderabad: బంగారం ధర వెలవెలబోయింది. నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.

Samayam Telugu 29 Oct 2020, 9:38 am

ప్రధానాంశాలు:

  • తగ్గిన బంగారం ధర
  • మళ్లీ పెరిగిన వెండి
  • గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు కిందకు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu today gold rate
నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మాత్రం పడిపోయింది. పసిడి ధర దిగివచ్చింది. గోల్డ్ రేటు తగ్గడం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.140 తగ్గింది. దీంతో ధర రూ.47,730కు క్షీణించింది.

Also Read: undefined

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 1877 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 23.35 డాలర్లకు ఎగసింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.