యాప్నగరం

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. వెండి నేలచూపులు!

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం రేటు ఈరోజు నేలచూపులు చూసింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది.

Samayam Telugu 4 Jan 2022, 4:35 am

ప్రధానాంశాలు:

  • పసిడి ప్రేమికులకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర
  • బంగారం ధర బాటలోనే పయనించిన వెండి రేటు
  • గ్లోబల్ మార్కెట్‌లో వెలవెలబోయిన బంగారం ధర
  • 1800 డాలర్ల సమీపంలో కదలాడుతున్న పసిడి రేటు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold price today
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర నేలచూపులు చూసింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. పసిడి రేటు బాటలోనే వెండి ధర కూడా పయనించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇదే ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు క్షీణించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 49,360కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 210 తగ్గుదలతో రూ. 45,250కు క్షీణించింది.

Also Read: undefined

బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 400 పడిపోయింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 66,200కు తగ్గింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1801.45 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా వెలవెలబోయింది. వెండి ధర ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 22.92 డాలర్లకు క్షీణించింది.

Also Read: undefined

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.