యాప్నగరం

Gold Rates: గుడ్‌న్యూస్.. గరిష్టాల నుంచి పడిపోయిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతకు దిగొచ్చిందంటే?

Gold Rates in Hyderabad: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తాజాగా పడిపోయాయి. క్రితం రోజు ఆల్ టైం గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్, దిల్లీ సహా ఇతర మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 8 Apr 2023, 6:31 am
Gold Rates in Hyderabad: బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట దక్కింది. గత రెండు, మూడు రోజులుగా విపరీతంగా పెరిగి జీవనకాల గరిష్టాలను తాకిన బంగారం ధర తాజాగా పడిపోయింది. అంతర్జాతీయంగా కూడా పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ మార్కెట్లలో.. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2010 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇది 2020 డాలర్లపైకి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే ఇది ఔన్సుకు 25 డాలర్లకు ఎగబాకడం గమనార్హం. ఇదే సమయంలో డాలర్ పడిపోయిన కారణంగా రూపాయి పుంజుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.875 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu gold rates today


గోల్డ్ రేటు తాజాగా హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.350 మేర పతనమైంది. దీంతో ఇప్పుడు రూ.55,900 మార్కుకు పడిపోయింది. ఇది 22 క్యారెట్ల గోల్డ్ రేటు. ఇక 24 క్యారెట్స్ విషయానికి వస్తే ఈ బంగారం రేటు 10 గ్రాములకు ఇప్పుడు ఒక్కరోజే రూ.380 పడిపోగా ప్రస్తుతం రూ.60,980కి దిగొచ్చింది. దిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు ఇలాగే పడిపోయింది. 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.350 తగ్గగా.. రూ.56,050కి పడిపోయింది. ఇదే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 పడిపోయి.. రూ.61,130 మార్కును తాకింది.

బంగారం ధరతో పాటు వెండి రేట్లు కూడా ఇటీవల రికార్డు గరిష్టాలకు వెళ్లాయి. కానీ ఇప్పుడు ఒక్కరోజులోనే పతనమయ్యాయి. ప్రస్తుతం దిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.600 పతనం కాగా.. రూ.76,490 మార్కుకు పడిపోయింది. ఇక హైదరాబాద్‌లో కూడా వెండి ధర పడిపోయింది. కిలోకు రూ.700 తగ్గి.. రూ.80 వేల మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ.80,700 వద్ద ఆల్ టైం హైని తాకింది.

ప్రస్తుతం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్టాల వద్ద ఉండటం.. భవిష్యత్తులో వీటి పెంపును నిలిపివేసే యోచనలో ఉండటం వంటి కారణాలు డాలర్ పడిపోవడం, గోల్డ్ పెరిగేందుకు దోహదపడుతున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఇదే సమయంలో అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా ఉండటం.. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కూడా గోల్డ్ వైపు జనాల్ని ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రేట్లు ఇంకా తగ్గే పరిస్థితులు లేవని నిపుణులు అంటున్నారు.

ఫ్లాట్ల కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు.. అక్కడ వేలకు వేలు అద్దె చెల్లిస్తున్న ఇంజినీర్లు.. అసలు కారణం

Layoffs: వందల కోట్ల నిధులొచ్చినా.. 30 శాతం ఉద్యోగుల్ని పీకేసిన సంస్థ.. ఆ ఒక్క కారణంతోనే!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.